అన్వేషించండి

Russia Ukraine War: ఐరాస అసెంబ్లీలో ఉక్రెయిన్‌కు భారీ మద్దతు, రష్యాకు షాక్ - ఓటింగ్‌కు భారత్ దూరం

Russia Ukraine War: ఐరాస అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా పెట్టిన ఓటింగ్‌లో ఉక్రెయిన్‌కు భారీ మద్దతు లభించింది.

Russia Ukraine War:

ఓటింగ్‌కు భారత్ దూరం..

రష్యా ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ క్షిపణుల దాడులు చేస్తోంది రష్యా. అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది. ఫలితంగా..రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. United Nations General Assembly (UNGA) ఉక్రెయిన్‌కు సంబంధించిన ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. తక్షణమే రష్యా సేనలు ఉక్రెయిన్‌ నుంచి వెనుదిరగాలని, యుద్ధం ఆపేయాలని తేల్చి చెప్పింది. యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ తీర్మానం తీసుకొచ్చింది. 141 ఓట్లతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే...భారత్, చైనా మాత్రం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డ్మిట్రో కులెబా ఈ తీర్మానంపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం పశ్చిమ దేశాలే కాకుండా మిగతా దేశాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవడాన్ని ప్రశంసించారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా ఉక్రెయిన్‌కు సపోర్ట్ ఇస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం అని తేల్చి చెప్పారు. అయితే...ఈ తీర్మానానికి బెలారస్, మాలి, నికరాగువా, రష్యా, సిరియా,ఉత్తరకొరియా, ఎరిటెరా దేశాలు వ్యతిరేకంగా  ఓటు వేశాయి.రష్యాకు మిత్రదేశమైన బెలారస్...ఈ తీర్మానంలో మార్పులు చేర్పులు చేయాలని పట్టు పట్టింది. ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన దేశాలకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ థాంక్స్ చెప్పారు. ట్విటర్‌లో వరుసగా పోస్ట్‌లు చేశారు. 

5 సార్లు తీర్మానాలు..

నిజానికి..ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో 5 సార్లు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశ పెట్టారు. గతేడాది అక్టోబర్‌లో పాస్ చేశారు. ఉక్రెయిన్‌ను రష్యా అక్రమంగా హస్తగతం చేసుకోవాలని చూడడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టగా 143 ఓట్లు ఉక్రెయిన్‌కు అనుకూలంగా వచ్చాయి. దాదాపు రెండ్రోజుల పాటు అసెంబ్లీలో ఇప్పటికే చర్చలు జరిగాయి. 75 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈ అంశంపై చర్చించారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 

Also Read: Pakistan Economic Crisis: అక్కడి కుక్కలు కూడా ఆకలితో ఉండకూడదు, పాకిస్థాన్‌కు భారత్ సాయం చేయాలి - RSS నేత


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget