Rich Rishi Sunak : రిషి సునాక్ ఆస్తి ఎంతో ఎంతో తెలుసా ? బ్రిటన్ కుబేరుల్లో ఆయనది ఎన్నో స్థానం అంటే ?
బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునాక్ ఎవరు ? ఆయన ఆస్తులు ఎంత ? ఆయన భార్య ఆస్తులు ఎంత ?
Rich Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయి చరిత్ర సృష్టించేందుకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న రిషి సునాక్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? ఆయన ఎంత ధనవంతుడు అన్న చర్చ జరుగుతోంది. ఆయన భారత మూలాలున్న వ్యక్తి మాత్రమే కాదు భారత సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు కూడా. అందుకే ఆయన బ్యాక్ గ్రౌండ్ ఆస్తులపై చర్చ జరుగుతోంది.
స్టాన్‌ఫర్డ్‌లో చదువుకున్న రిషి
సౌతాంప్టన్‌లో జన్మించిన రిషి సునాక్ పాతికేళ్లకే మిలియనీర్ అయ్యాడు. ఆయన తల్లిదండ్రులు భారత మూలాలున్న వారే అయినప్పటికీ వారు ఈస్ట్ ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పుట్టిన రిషి సునాక్.. ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో చేశారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత గోల్డ్ మాన్ శాచ్స్ లో కొంత కాలం పని చేశారు . రెండు హెడ్జ్ ఫండ్స్‌లో పార్టనర్‌గా కూడా ఉన్నారు. అక్కడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె పరిచయడం కావడంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత బ్రిటన్‌లో వ్యాపారాలు ప్రారంభించారు.
రిషి భార్య ఇన్ఫోసిస్ వారసురాలు అక్షతా మూర్తి
రిషి సునక్ , ఆయన భార్య అయిన అక్షత మూర్తి సంయుక్త సంపద బ్రిటన్ కుబేరుల్లో వారికి చోటు కల్పించింది. బ్రిటన్‌లో ఉన్న ధనవంతుల జాబితాలో వారి నెంబర్ 222గా ఇటీవల ఓ మీడియా సంస్థ లెక్క కట్టింది. అక్షతకు ఒక్క ఇన్ఫోసిస్‌లోనే బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉండగా, ఎలిజిబిత్ సంపద 450 మిలియన్ డాలర్లు (350 మిలియన్ పౌండ్లు)గా ఉందని 2021 సండే టైమ్స్ రిచ్ లిస్ట్ పేర్కొంది.
బ్రిటన్‌లోని కుబేరుల్లో రిషి, అక్షతా మూర్తి ఒకరు
అక్షత, రిషి సునక్‌లకు లండన్‌లోని కెన్సింగ్‌టన్‌లో 7 మిలియన్ పౌండ్ల విలువైన ఫైవ్ బెడ్‌రూమ్ హౌస్ ఒకటి ఉందని, కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఓ ఫ్లాట్ కూడా ఉందని సండే టైమ్స్ పేర్కొంది. అక్షత వివిధ బిజినెస్‌లలో కూడా ఇన్వెస్ట్ చేశారు. రిషి సునక్‌తో కలిసి ఆమె 2013 లో కేటమరన్ వెంచర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో ఆమె డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా అక్షత డిజైన్స్ పేరుతో సొంతగా ఫ్యాషన్ లేబుల్‌ను కూడా ఆమె క్రియేట్ చేశారు. అక్షత మూర్తికి ఇన్ఫోసిస్‌లోని వాటాలకు అదనంగా 300 మిలియన్ పౌండ్ల వ్యక్తిగత సంపద ఉందని బ్రిటన్ మీడియా పేర్కొంది.
భర్తకు తోడునీడగా అక్షతా
అక్షత మూర్తికి బ్రిటన్‌లో నాన్–డొమిసైల్ స్టేటస్ ఉంది. దీనర్ధం ఆమె పర్మినెంట్ అడ్రస్ బ్రిటన్ కాదు. దీంతో అక్షతకు విదేశాల్లో సంపాదించే మొత్తానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా విమర్శలు రావడంతో విదేశాల్లోని ఆస్తులు, బిజినెస్‌ల ద్వారా వచ్చిన ఇన్‌కమ్, డివిడెండ్స్, క్యాపిటల్ గెయిన్స్‌పై కూడా యూకేలో ట్యాక్స్ కడతానని అక్షత ప్రకటించి వివాదాన్ని ముగించారు.