అన్వేషించండి

Rice Exports: బియ్యం ఎగుమతిపై పెద్ద మనుసు చేసుకోండీ- భారత్‌కు ఐఎంఎఫ్ రిక్వస్ట్

Rice Exports: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాని భారత్ ను ఐఎంఎఫ్ కోరింది. 

Rice Exports: దేశంలో బియ్యం ధరల స్థిరీకరణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు దేశాల్లో సంక్షోభం నెలకొంది. దేశంలో బియ్యం ధరలు నానాటికీ పెరుగుతుండటంతో ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. విదేశాల్లో ఉంటున్న భారతీయులు బియ్యం కోసం తిప్పలు పడుతున్నారు. స్టోర్లు, మాల్స్ ముందు క్యూలు కడుతున్నారు. మార్ట్ లలో భారతీయులు బియ్యం కోసం ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతి దారు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే బియ్యంలో దాదాపు 40 శాతం వరకు కేవలం భారత్ నుంచే అన్ని దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో చాలా దేశాల్లో బియ్యం కొరత వేధిస్తోంది. 

ఈ నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు, ఆయా దేశాల్లో ఉంటున్న వారికి మరెక్కడి నుంచి బియ్యం వస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది అవసరానికి మించి ఎక్కువ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో చాలా స్టోర్లలో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. పలు మాల్స్ లో అధికంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. పలు స్టోర్లలో ఒకరికి ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు. మరికొన్ని మాల్స్ లో ఒకరికి కేవలం 5 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. 

చాలా దేశాల్లో బియ్యం కొరత వల్ల బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత్ ను కోరింది. ఈ కొరత వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రకమైన పరిమితులు ఇతర దేశాల్లోని ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్ ఒలివర్ గౌరించాస్ అన్నారు. 

కాగా, అమెరికాలోని ఇండియన్ స్టోర్ లలో బియ్యం కొనుగోళ్లపై పరిమితులు కొనసాగుతున్నాయి. భారతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక కుటుంబానికి ఒక బ్యాగ్ మాత్రమే అనే బోర్డులు పెట్టి మరీ విక్రయాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఎక్కువగా అమెరికా, థాయ్ లాండ్, ఇంటలీ, స్పెయిన్, శ్రీలంక సహా ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mahabharat: ఉచిత పథకాలు ప్రకటించడం కాదు ఆ అవసరం లేకుండా చేయడమే రాజధర్మం! ఈ కథ మీకోసమే!
ఉచిత పథకాలు ప్రకటించడం కాదు ఆ అవసరం లేకుండా చేయడమే రాజధర్మం! ఈ కథ మీకోసమే!
CM Vijay: ఓఎస్డీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్.. విమర్శలతో వెనక్కి తగ్గిన దళపతి
ఓఎస్డీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్.. విమర్శలతో వెనక్కి తగ్గిన దళపతి
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ABP Desam Top 10, 13 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 13 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
Embed widget