RG Kar Doctor Rape Murder Case: పోలీసులు డబ్బులివ్వబోయారు, అటాప్సీ రిపోర్టు ఆలస్యం చేశారు - కోల్‌కతా డాక్టర్ తల్లిదండ్రుల తీవ్ర ఆరోపణలు
Kolkata : కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు లో పోలీసులు తమకు లంచం ఇవ్వబోయారని డాక్టర్ కుటుంబం సంచలన ఆరోపణలు చేసింది. అటాప్సీ రిపోర్టును కూడా కావాలని ఆలస్యంగా ఇచ్చారని అంటున్నారు.
RG Kar Doctor Rape-Murder Case: కోల్ కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సంచలన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కోల్ కతా పోలీసులపై డాక్టర్ కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు తమకు లంచం ఇవ్వబోయారని.. అటాప్సీ రిపోర్టును కూడా ఆలస్యం చేశారన్నారు. ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయినప్పటికీ ఈ వ్యవహారంలో రోజు రోజుకు కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కోల్ కతా పోలీసులు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిరంచారని ఏదో దాచి పెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బాధితురాలి కుటుంబానికి డబ్బులివ్వడానికి ప్రయత్నించారని వెల్లడి కావడం సంచలనం రేపుతోంది.
షేక్ హసీనా నోరెత్తకూడదు - భారత్‌దే ఆ బాధ్యత - బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ హెచ్చరిక
హత్యాచారానికి గురైన డాక్టర్ కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పోలీసుల తీరుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసు విషయంలో వారు మొదటి నుంచి సరైన రీతిలో స్పందించలేదన్న ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె పోస్టు మార్టం పూర్తి కాక ముందే ఓ పోలీసు ఉన్నతాధికారి తమకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారని బాధితురాలి తండ్రి తాజాగా బయట పెట్టారు. ఇదేనా పోలీసుల మానవత్వం అని.. వారు ప్రశ్నిస్తున్నారు. తమ కుమార్తె మృతదేహం అప్పగించిన తర్వాత తమను మూడు నుంచి నాలుగు వందల మంది పోలీసులు చుట్టు ముట్టే ఉన్నారని.. వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని ఒత్తితి చేశారని వారంటున్నారు.
అదే సమయంలో కొంత మంది అధికారులు తెల్ల కాగితంమీద సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారన్నారు. అయితే తాను ఆ పత్రాలను చింపిపక్కన పడేశానని బాధితురాలి తండ్రి తెలిపారు. తాను నిద్రపోలేకపోతున్నానని తన కుమార్తెపై దారుణానికి వారు కూడా నిద్రపోకుండా చేసేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలి తల్లి స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు . తన కుమార్తె పై జరిగిన ఘోరం విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదనడానికి అనేక ప్రశ్నలు డాక్టర్ తల్లిదండ్రులు సంధిస్తున్నారు. అసలు ఎలాంటి విచారణ చేయకుండానే ఆత్మహత్య చేసుకుందని చెప్పారని మండిపడుతున్నారు.
ఆ తమిళ దర్శకుడు ప్రైవేటు పార్టుల్లో రాడ్డు పెట్టి శునకానందం పొందేవాడు - కేరళ నటి సౌమ్య సంచలన ఆరోపణలు
ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన ఘోరంపై ఇప్పటికీ కోల్ కతాలో నిరసనలు జరుగుతున్నాయి. ఇటీవల ఆర్జీకర్ మెజికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను అరెస్టు చేశారు. మరికొంత మంది కీలక నిందితుల్ని అరెస్టు చేసే అవకాశాల ఉన్నాయి. రేప్ చేసే నిందితుల్ని ఉరి తీయాలని.. ఇటీవలే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపరాజిత చట్టం పేరుతో కొత్త చట్టం తీసుకు వచ్చారు. ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా నిందిస్తున్నారు. బీజేపీ మమతా బెనర్జీ సర్కార్ పై ఆరోపణలు చేస్తోంది.