Republic Day 2024 LIVE Updates: కర్తవ్యపథ్‌లో కాసేపట్లో గణతంత్ర వేడుకలు - ఢిల్లీ మొత్తం హైఅలర్ట్!
Republic Day 2024 LIVE Updates: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
LIVE
Background
Republic Day Celebrations in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలను పటిష్ట భద్రత నడుమ నిర్వహించనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు చేస్తున్నారు. దేశ రాజధానిలోని కర్తవ్య పథ్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పాఠక్ భద్రతకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కర్తవ్య మార్గ్‌లోని ప్రధాన ప్రాంతంలో 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
పోలీసు పహారాలో ఢిల్లీ
గణతంత్ర దిన వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు పహారాలో ఉండనుంది. కమాండోలు, క్విక్ రియాక్షన్ టీమ్‌లు, పీసీఆర్ వ్యాన్‌లు, మోర్పాలు, యాంటీ డెమోలిషన్ డిటెక్షన్ టీమ్స్, స్పాట్ టీమ్‌లు విధి నిర్వహణతోపాటు ఢిల్లీలోని సున్నితమైన ప్రదేశాల్లో మోహరించనున్నారు. ఢిల్లీలోన సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసి వేయనున్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించనున్నట్టు దీపేంద్ర పాఠక్ వెల్లడించారు.
28 జోన్లుగా విభజన
గణతంత్ర దినోత్సవ వేడుకలు నేపథ్యంలో భద్రతా పరమైన ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీని 28 జోన్లుగా విభజించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ జోన్లలో పోలీసు ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. ఇక హెల్ప్ డెస్కులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సమయానికి అతిథులు చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. చెక్ పాయింట్ల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకలను రప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
రిపబ్లిక్ డే అంటే మనకి గుర్తొచ్చేది స్కూల్ యూనిఫామ్, రెడీ అవ్వడం, ఫ్లాగ్‌ని పట్టుకోవడం, ఫ్లాగ్ హోస్టింగ్, స్పీచ్. వయసు మారినా.. జనరేషన్ మారినా.. ఇవి మాత్రం కామన్‌గా జరుగుతుంటాయి. అయితే స్కూల్‌కి రెడీ అయి వెళ్లడం వరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత స్పీచ్ చెప్పమంటే కాస్త భయంగానే ఉంటుంది. కేవలం స్టూడెంట్స్‌కే కాదు టీచర్లకు కూడా ఏమి స్పీచ్ ఇవ్వాలి? ఎలాంటి స్పీచ్ ఇవ్వాలని అంశంపై కాస్త భయం ఉంటుంది. అయితే మీరు ఎలాంటి భయం లేకుండా స్వీచ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఉంది. మీరు చూసేయండి. రిపబ్లిక్ డే రోజు చెప్పేయండి.
రిపబ్లిక్ డే స్పీచ్ అంటే ఏదో ఫార్మాలటీగా ఇచ్చేది కాదు. టీచర్స్‌కి పిల్లలకు చెప్పేందుకు చాలా విషయాలు ఉంటాయి. కానీ స్టూడెంట్స్‌కి కాస్త తక్కువ అవగాహన ఉంటుంది. పైగా మంచి స్పీచ్ ఇచ్చిన స్టూడెంట్స్‌కి బహుమతులు ఇస్తారు కాబట్టి.. మీరు స్వీచ్ ఇచ్చేప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? దీని కోసం ఎవరు త్యాగం చేశారు వంటి విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి.
స్టూడెంట్స్ స్పీచ్ ఇవ్వాలంటే..
ముందుగా స్జేజ్ మీద ఉన్న పెద్దలందరికీ విష్ చేయాలి. తర్వాత స్టూడెంట్స్‌కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పాలి. 200 ఏళ్ల బ్రిటీష్ పాలను నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విధానం.. సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఎలా మారింది వంటి విషయాలు చెప్పాలి. జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతలు చెప్పవచ్చు. జాతీయ గీతం ఎవరు రాశారు? జాతీయ జెండాలో రంగులు దేనిని సూచిస్తాయి వంటి అంశాలు స్పీచ్‌ను ఇంట్రెస్టిగ్గా మారుస్తాయి. మనం జనవరి 26న ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాము? భారత రాజ్యాంగం ఆ రోజున ఉనికిలోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రాధాన్యతను చెప్పవచ్చు. ఈ అంశాలను మీరు స్పీచ్ ఇచ్చేప్పుడు లేదా వ్యాసాల పోటీల్లో పాల్గొనేప్పుడు ఫాలో అవ్వొచ్చు.
టీచర్స్ స్పీచ్ ఎలా ఉండాలంటే..
స్టూడెంట్స్‌కి తెలియని విషయాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగే నాల్డెజ్ ఉండాలి. ఉదాహరణకు రిపబ్లిక్ డే అంటే ఏమిటి అనగానే గణతంత్ర దినోత్సవం అని చెప్తారు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది. ఆ రోజు ఏమి జరిగింది వంటి విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించవచ్చు. రాజ్యంగా రాయడానికి ఎన్ని నెలలు పట్టింది? ఎంత ఖర్చు అయింది వంటి విషయాలు చెప్పవచ్చు. ఈ సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన ఎన్ని ఏళ్లకు రాజ్యాంగాన్ని పూర్తి చేయగలిగారు వంటి విషయాలు చెప్తే పిల్లలకు మంచిగా ఉంటుంది. వారికి కొన్ని ముఖ్యవిషయాల పట్ల అవగాహన పెరుగుతుంది.
స్పీచ్ ఇచ్చే సమయంలో స్టూడెంట్స్ అయినా.. టీచర్స్ అయినా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. దీనివల్ల మీరు చెప్పాలనుకునే కచ్చితంగా చెప్పగలుగుతారు. లేదంటే మీరు అన్ని విషయాలు కలిపి చెప్పేస్తారు. కాబట్టి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది ముందుగానే ప్రిపేర్ అయితే స్ట్రెస్ ఉండదు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 80 మంది సైనికులకు శౌర్య పురస్కారాలు
ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు చెందిన 80 మంది సైనికులను శౌర్య పురస్కారాలతో సత్కరించనున్నారు. వీరిలో 12 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. 80 శౌర్య పురస్కారాల్లో 6 కీర్తి చక్ర, 16 శౌర్య చక్ర, 53 సేన పతకాలు, 1 నేవీ మెడల్, 4 వాయుసేన పతకాలు ఉన్నాయి. గాలంట్రీ అవార్డులతోపాటు 311 డిఫెన్స్ డెకరేషన్స్ కూడా ఇచ్చారు. వీటిలో 31 పరమ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ సేవా పతకాలు, 2 అతి విశిష్ట సేవా పతకాలు, 59 అతి విశిష్ట సేవా పతకాలు, 10 యుద్ధ సేవా పతకాలు, 8 సేన మెడల్ బార్, 38 సేన పతకాలు, 10 నేవీ పతకాలు, 14 వాయుసేన పతకాలు, 5 విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి.
Republic Day 2024 LIVE Updates: బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన జేపీ నడ్డా
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జెండాను ఎగురవేశారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.