Rashtrapatni Remark Row: ఇది సిగ్గుచేటు- కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే: మాయావతి డిమాండ్
Rashtrapatni Remark Row: అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కాంగ్రెస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.
Rashtrapatni Remark Row: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు. ఇది అత్యంత సిగ్గుచేటు అని మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
1. भारत के सर्वोच्च राष्ट्रपति पद पर आदिवासी समाज की पहली महिला के रूप में द्रौपदी मुर्मू जी का शानदार निर्वाचन बहुत लोगों को पसंद नहीं। इसी क्रम में लोकसभा में कांग्रेस के नेता श्री अधीर रंजन चौधरी द्वारा उनके खिलाफ आपत्तिजनक टिप्पणी करना अति-दुःखद, शर्मनाक व अति-निन्दनीय। 1/2
— Mayawati (@Mayawati) July 28, 2022
ఇదీ జరిగింది
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే భాజపా ఎంపీలు ఆందోళనకు దిగారు.
లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.