అన్వేషించండి

Rajya Sabha Election 2024: ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు, ఏపీ తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో పోలింగ్

rajya sabha election 2024: ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

Rajya Sabha Election Schedule 2024: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 8న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు సమర్పించేందుకు ఫిబ్రవరి 15న చివరి గడువుగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. యూపీలో అత్యధికంగా 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆ తరవాత బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు చొప్పున సభ్యుల ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌లో మూడు సీట్లున్నాయి. ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో సీట్‌కి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 

ముఖ్యమైన తేదీలివే..

ఎన్నికల నోటిఫికేషన్ - ఫిబ్రవరి 8

నామినేషన్లకు ఆఖరి తేదీ - ఫిబ్రవరి 15

నామినేషన్ల పరిశీలన - ఫిబ్రవరి 16

నామినేషన్ల ఉపసంహరణకి చివరి తేదీ - ఫిబ్రవరి 20

పోలింగ్ వివరాలు..

పోలింగ్:  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ 
 
కౌంటింగ్: ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు 

పోలింగ్ ఎలా జరుగుతుందంటే..

రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల వివరాలుంటాయి. ఆ పేర్లలో తనకు నచ్చిన పేరుని మార్క్ చేసి బాక్స్‌లో వేస్తారు ఎమ్మెల్యేలు. తొలిరౌండ్‌లో అవసరమైన మెజార్టీ సాధించిన వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఆ ఓట్లను ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అన్ని వేకెన్సీలు భర్తీ అయ్యేంత వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
War 2 Movie Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
War 2 Movie Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
AP Cabinet Meeting: నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
Arjun S/O Vijayanthi Teaser: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌ Vs కొడుకు - ఈ తల్లీకొడుకుల కథేంటో?, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ చూశారా!
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌ Vs కొడుకు కోపం - ఈ తల్లీకొడుకుల కథేంటో?, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ చూశారా!
Embed widget