News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం

C-295 MW:భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాన్ని సోమవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారికంగా ప్రవేశపెట్టారు.

FOLLOW US: 
Share:

భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాన్ని సోమవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారికంగా ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హిండన్‌ ఎయిర్‌బేస్‌లో జరుగుతున్న భారత్‌ డ్రోన్‌ శక్తి-2023 కార్యక్రమంలో  పాల్గొన్న రాజ్‌నాథ్‌ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వాయుసేనలో చేర్చారు. ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరితో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా వీరు 5కేజీల నుంచి 100 కేజీల పేలోడ్‌ను తీసుకెళ్లగలిగే డ్రోన్ల ప్రదర్శనను తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా సీ-295కు మంచి పేరు ఉంది. ఇది బరువు, మిషన్‌ క్లాస్‌లో సాటిలేని విమానం. దీని కోసం 39 ఆపరేటర్ల నుంచి 280 దాకా ఆర్డర్లు వచ్చాయని తయారీ సంస్థ వెల్లడించింది. 

కొత్తగా వాయుసేనలో ప్రవేశపెట్టిన సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానం భారత వాయుసేనకు ఎయిర్‌లిఫ్ట్‌ సామర్థ్యాన్ని ఎంతగానో పెంచుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎస్‌-748 అవ్రో ఎయిర్‌ క్రాఫ్ట్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది కఠినమైన ప్రదేశాలు, రన్‌వేలు సరిగ్గా లేని చోట కూడా ల్యాండింగ్‌ కాలగదు. డ్రోన్‌ శక్తి కార్యక్రమంలో పాల్గొన్న స్పెయిన్‌ రాయబారి రిడావో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్పెయిన్‌ నుంచి వచ్చిన తొలి విమానం ఇదే అని, తాము చాలా సంతోషంగా ఉన్నామని, భారత్‌కు ముఖ్యమైన భాగస్వామిగా మారేందుకు తమకు ఇది మంచి అవకాశమని ఆయన తెలిపారు.  

సీ-295 విమానాలను స్పానిష్‌ ఎయిరోస్పేస్‌ కంపెనీ సీఏఎస్‌ఏ ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ నుంచి భారత్‌ తెప్పించుకుంటోంది. ఇలాంటివి మొత్తం 56 విమానాలు కొనుగోలు చేసేందుకు ఈ సంస్థతో సుమారు రూ.22వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 16 విమానాలను 2025 నాటికి భారత్‌కు సరఫరా చేస్తుంది.  మొదటి విమానం ఈ సెప్టెంబరు 20న భారత్‌కు చేరుకోగా సోమవారం అధికారికంగా వాయుసేనకు అప్పగించారు. మిగిలిన విమానాలను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌తో కలిసి దేశీయంగా తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి విడిభాగాలను హైదరాబాద్‌లోని ఎంసీఏ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే గత ఏడాది అక్టోబరులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాల తయారీ కేంద్రానికి వడోదరలో శంకుస్థాపన చేశారు. సీ-295 విమానం 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్ల గలదు. అలాగే 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను కావాల్సిన ప్రాంతాలకు తరలించగలదు. 

డ్రోన్‌ శక్తి కార్యక్రమంలో వివిధ రకాల డ్రోన్లను ప్రదర్శించారు. సర్వే డ్రోన్లు, అగ్రికల్చర్‌ డ్రోన్స్‌, అగ్నిమాపక డ్రోన్లు, టాక్టికల్‌ సర్వైలెన్స్‌ డ్రోన్లు, ఎక్కువ బరువు ఎత్తగలిగే లాజిస్టిక్‌ డ్రోన్లను ఇంకా ఎన్నో రకాలైన డ్రోన్లను ప్రదర్శించారు. ఐఏఎఫ్‌ ఇప్పడు స్వదేశీ డ్రోన్‌ రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యాన్ని గుర్తిస్తోంది. ఇటీవల కాలంలో డ్రోన్‌ టెక్నాలజీ కారణంగా పౌర రక్షణను వేగంగా మార్పు తీసుకురావడం సాధ్యమైంది. వీటి వల్ల మెరుగైన సామర్థ్యం ఉండడంతో పాటు రిస్క్‌ ఎక్స్‌పోజర్‌ను చాలా తగ్గించింది. ఇంటలిజెన్స్‌, నిఘా కార్యకలాపాల కోసం రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రయోగించడంలో భారత వాయుసేనకు మంచి అనుభవం ఉంది.

Published at : 25 Sep 2023 05:04 PM (IST) Tags: Rajnath Singh Indian Airforce IAF INDIA C-295 MW Transport Aircraft

ఇవి కూడా చూడండి

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Share Market Opening Today: ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్లు - 70k మార్క్‌తో చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌

Share Market Opening Today: ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్లు - 70k మార్క్‌తో చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌

MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది

MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది

Higher Interest Rate: ఎక్కువ వడ్డీని ఇచ్చే మూడు స్పెషల్‌ FDలు, ఈ నెలాఖరు వరకే మీకు అవకాశం

Higher Interest Rate: ఎక్కువ వడ్డీని ఇచ్చే మూడు స్పెషల్‌ FDలు, ఈ నెలాఖరు వరకే మీకు అవకాశం

Petrol Diesel Price Today 11th December: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol Diesel Price Today 11th December: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌