News
News
X

Rajasthan News: దీపావళికి అదిరిపోయే స్కీమ్‌ తెచ్చిన ప్రభుత్వం, వాళ్ల చదువులకయ్యే ఖర్చంతా భరిస్తుందట

Rajasthan News: బాలికల చదువులకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

FOLLOW US: 

 Rajasthan News:

రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటన..

దీపావళి సందర్భంగా రాజస్థాన్ ప్రభుత్వం బాలికలకు అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. ఇందిరా శక్తి ఫ్రీ రీఛార్జ్ స్కీమ్‌ను ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం...Right To Educationలో భాగంగా చదువుకుంటున్న బాలికల ఖర్చులు తామే భరిస్తామని వెల్లడించింది. 12వ తరగతి వరకూ వాళ్ల చదువులకయ్యే ఖర్చులు సర్కార్ భరించనుంది. Indira Shakti Fee Rechargeలో భాగంగా...ఈ పథకం అమలు చేయనుంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో సీఎం అశోక్ గహ్లోట్ ఈ విషయం వెల్లడించారు. అప్పటి నుంచి దీనిపై అధికారులు విస్తృతంగా చర్చించారు. ఎలా అమలు చేయాలనే దానిపై సంప్రదింపులు జరిపారు. దీపావళి సందర్భంగా...ఇది ప్రకటించారు. 9-12 తరగతి వరకూ బాలికలకు ఉచిత విద్య అందించనున్నట్టు గహ్లోట్ స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమలు చేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బాలికా విద్యను ప్రోత్సహించటంలో భాగంగా...ఈ నిర్ణయ తీసుకుంది గహ్లోట్ సర్కార్. ఈ ఏడాది 8వ తరగతి పూర్తి చేసి 9వ తరగతిలో అడుగు పెట్టే బాలికలకూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

బాలికా విద్యకు ప్రోత్సాహం..

News Reels

విద్యాశాఖ మంత్రి డాక్టర్ బీడీ కల్లా ( Dr. BD Kalla) సీఎం అశోక్ గహ్లోట్‌పై ప్రశంసలు కురిపించారు. బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన బాలికలకు మెరుగైన విద్య అందించేందుకు Right to Education కార్యక్రమం ప్రారంభించినట్టు గుర్తు చేశారు. ఈ RTE కింద రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో వెనకబడిన వర్గాలకు చెందిన బాలికలకు 25% సీట్‌లు రిజర్వేషన్‌ ఇస్తున్నట్టు చెప్పారు. 1-8వ తరగతి వరకూ చదువుతున్న బాలికల విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. డ్రాపౌట్‌లు తగ్గించటంలో ఈ నిర్ణయం కీలకం కానుంది. మరో విశేషం ఏంటంటే...దీపావళి సందర్భంగానే...
ఈ స్కీమ్‌కు సంబంధించిన పోర్టల్, యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 

సీఎం కుర్చీపై రగడ..

రాజస్థాన్ సీఎం కుర్చీ విషయంలో రగడ చల్లారలేదు. తనను పక్కన పెట్టి సచిన్‌ పైలట్‌కు అధికారం అప్పగిస్తే ప్రభుత్వం నిలబడదని గహ్లోట్...సోనియాతో చెప్పినట్టుసమాచారం. గహ్లోట్‌తో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా సచిన్‌ పైలట్‌పై గుర్రుగా ఉన్నారు. ఆయనకు అధికారం దక్కకూడదని చాలా మొండి పట్టు పడుతున్నారు. సచిన్‌ పైలట్‌కు అహం ఎక్కువ అని మండి పడుతున్నారు. స్టేట్ చీఫ్‌గా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ను ముంచాలని చూశారని, అలాంటి వ్యక్తిని సీఎంగా చేయాలన్న ఆలోచనే రాకూడదని గహ్లోట్ వర్గీయులు చాలా గట్టిగానే వాదిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పోరు నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించే ముందు...సోనియాతో దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు గహ్లోట్. ఆ సమయంలోనూ సచిన్ పైలట్‌పై తనకున్న అసంతృప్తినంతా వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. నిజానికి...కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గహ్లోట్‌నే చూడాలని అనుకున్నారు సోనియా గాంధీ. నామినేషన్ వేసేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. కానీ...ఉన్నట్టుండి ఒక్కరోజులో రాజస్థాన్ రాజకీయాలన్నీ మారిపోయాయి. ఒక వ్యక్తి ఒకే పదవి నిబంధన ప్రకారం...గహ్లోట్ అధ్యక్ష పదవికి ఎంపికైతే..రాజస్థాన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే ఆయనకు, అధిష్ఠానానికి పొసగలేదు. 

Also Read: PM Modi Vizag Tour: నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోదీ - పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారా !

Published at : 26 Oct 2022 11:33 AM (IST) Tags: Rajasthan Right To Education Rajasthan News:  Rajasthan Indira Shakti Fee Recharge Ashok Gehlot Free Education

సంబంధిత కథనాలు

TSPSC DAO Exam Date: డీఏఓ పోస్టుల రాతపరీక్ష తేదీ ఖరారు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC DAO Exam Date: డీఏఓ పోస్టుల రాతపరీక్ష తేదీ ఖరారు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Gold-Silver Price 27 November 2022: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ.53 వేల దిగువకు - ఊరటనిచ్చిన వెండి

Gold-Silver Price 27 November 2022: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ.53 వేల దిగువకు - ఊరటనిచ్చిన వెండి

Petrol-Diesel Price, 27 November 2022: వాహనదారులకు ఊరట - తెలంగాణలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఏపీలో ఇలా

Petrol-Diesel Price, 27 November 2022: వాహనదారులకు ఊరట - తెలంగాణలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఏపీలో ఇలా

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Nizamabad: కుక్కల కోసం ఖర్చు చేశారా! కాజేశారా ? రూ.20 లక్షల ఖర్చుపై అనుమానాలు

Nizamabad: కుక్కల కోసం ఖర్చు చేశారా! కాజేశారా ? రూ.20 లక్షల ఖర్చుపై అనుమానాలు

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి