Rahul Gandhi Disqualification: వాయనాడ్‌లో బ్లాక్‌డే, రాహుల్‌పై అనర్హత వేటుని ఖండిస్తూ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం
Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీపై అనర్హతా వేటుని ఖండిస్తూ వాయనాడ్‌లో కాంగ్రెస్ బ్లాక్‌డేగా ప్రకటించింది.
Rahul Gandhi Disqualification:
నిరసనలు..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కించాయి. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులూ పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్నాయి. కేరళలోని వాయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి అక్కడ మంచి ఫాలోయింగే ఉంది. రాహుల్ ఎంపీగా కొనసాగేందుకు వీల్లేదని లోక్‌సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయంపై వాయనాడ్ కాంగ్రెస్ కమిటీ ఆందోళనలు చేపడుతోంది. ఈ రోజు (మార్చి 25) బ్లాక్‌డేగా ప్రకటించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్‌డీ అప్పచన్ ఈ విషయం అధికారికంగా వెల్లడించారు.
"రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ రోజుని బ్లాక్‌డేగా ప్రకటించింది"
- ఎన్‌డీ అప్పచన్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
Kerala | As part of the protest against the disqualification of Rahul Gandhi from Loksabha, Wayanad District Congress Committee to observe 'Black Day' today: ND Appachan, President of District Congress Committee, Wayanad
— ANI (@ANI) March 24, 2023
ఇప్పటికే కాంగ్రెస్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయంతో తమను భయపెట్టలేరని స్పష్టం చేస్తోంది. అదానీ, మోదీ మైత్రి గురించి అడిగినందుకే బీజేపీ ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని మండి పడుతోంది.
తనపై అనర్హతా వేటు వేసిన తరవాత తొలిసారి రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. తాను భారత దేశ ప్రజల గొంతుకను వినిపిస్తున్నానని, ఇందుకోసం ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.
"నేను భారత దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను. వాళ్ల గొంతుకను వినిపించేందుకు పోరాడుతున్నాను. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
मैं हर कीमत चुकाने को तैयार हूं।
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బీజేపీపై మండి పడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌తో రాజకీయపరమైన విభేదాలున్న పార్టీలు కూడా ఆయనకు అండగా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీపై వరుస ట్వీటల్తో విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత్ జోడో యాత్రతో రాహుల్ చరిష్మా పెరిగిందని, ఇది చూసే బీజేపీ భయపడిందని అని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ నియంతృత్వ వైఖరికి ఈ నిర్ణయమే నిదర్శనం అంటూ పలువురు నేతలు ట్వీట్లు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దేనికీ భయపడమని, మౌనంగా ఉండమని స్పష్టం చేసింది. చట్ట పరంగా, రాజకీయంగా కచ్చితంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జైరాం రమేశ్ తేల్చి చెప్పారు.