అన్వేషించండి

karnataka govt scraps muslim quota : ఎన్నికల ముందు క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్- ముస్లింల‌ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు

కర్ణాటక ప్ర‌భుత్వం ముస్లింల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

కర్ణాటక ప్ర‌భుత్వం ముస్లింల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. అధికార బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ వ‌ర్గానికి ఉన్న 4శాతం ఓబీసీ రిజర్వేషన్లను ర‌ద్దు చేసిన బొమ్మై ప్ర‌భుత్వం మొత్తం రిజర్వేష‌న్ల‌ను 56 శాతానికి పెంచింది. ఫ‌లితంగా ఆ రాష్ట్రంలో ముస్లింలు ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌(ఈడబ్ల్యూఎస్) విభాగంలో 10శాతం రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. మ‌రోవైపు.. ముస్లింలకు ర‌ద్దు చేసిన‌ 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగ‌, లింగాయత్ సామాజిక వ‌ర్గాలకు కేటాయించ‌నున్నారు.

బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కేటాయింపుల తొల‌గించ‌డంతోపాటు.., రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. దీనికి ముందు జరిగిన మంత్రివ‌ర్గ‌ సమావేశంలో రిజర్వేషన్లను 50 నుంచి 56 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ 10 శాతం కేటగిరిలో బ్రహ్మణులు, వైశ్యులు, ముదలియార్లు, జైన సామాజిక‌వర్గాల త‌ర‌హాలోనే ముస్లింలు కూడా రిజర్వేషన్లు పొందనున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం బొమ్మై మతపరమైన మైనారిటీల కోటాను రద్దు చేసి వారిని ఎలాంటి షరతులు లేకుండా ఈడబ్ల్యూఎస్ కిందికి తీసుకువస్తామని ప్రకటించారు.

గతేడాది బెలగావిలో జ‌రిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2సీ, 2డీ అనే రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీలను సృష్టించి ముస్లింలకు ఉన్న 4 శాతాన్ని వొక్కలిగ (2శాతం), లింగాయత్ (2 శాతం) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు) రిజర్వేషన్ 15 నుంచి 17 శాతం, ఎస్టీల రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంచారు. "కోటా కేటగిరీలలో మార్పులను క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు చేసింది మరియు మేము దానిని అమ‌లు చేసాము" అని బొమ్మై తెలిపారు.

"రాజ్యాంగంలో మతపరమైన మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం లేదు. ఇది ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మతపరమైన మైనారిటీలకు రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసింది. బీఆర్ అంబేద్కర్ కూడా కులాలకు రిజర్వేషన్లు అని స్పష్టంగా చెప్పారు" అని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. త్వరలో లేదా తరువాత, ఎవరైనా మతపరమైన మైనారిటీలకు రిజర్వేషన్ల అంశంపై సవాలు చేయవచ్చు. అందువ‌ల్లే ప్రభుత్వం చురుకైన నిర్ణయం తీసుకుంద‌ని వెల్ల‌డించారు. ముస్లింలకు10 శాతం ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీలో కూడా అవే ఆర్థిక ప్రమాణాలు కొనసాగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో ఉన్న ‘కడు కురుబ’, ‘గొండ కురుబ’ అనే రెండు గొర్రెల కాపరి వర్గాలను ఎస్టీ కేటగిరీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేశామ‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి తెలిపారు.

దీంతో పాటు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక మంత్రివర్గం శుక్రవారం తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా జనసంఖ్య అనుగుణంగా రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఇటీవల పెంచిన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌నూ తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంట్‌లో చర్చకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపారు. కాగా.. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Embed widget