అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే! నితీశ్ కుమార్ అలక - ఫోన్‌ చేసిన బుజ్జగించిన రాహుల్

I.N.D.I.A Meet: విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గేని ప్రతిపాదించడంపై నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

 I.N.D.I.A PM Race: 


ప్రధాని అభ్యర్థిపై వాగ్వాదం..? 

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) కోసం ఇప్పటి నుంచి అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఈ కూటమిలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అయితే...ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ని కాస్త డీలా పడేలా చేశాయి. లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది ఆ పార్టీ. ఇప్పటికే విపక్ష కూటమిలోనే కీలక నేతలతో సమావేశమైంది. ఈ సమయంలోనే ప్రధాని అభ్యర్థి ఎవరన్న చర్చ వచ్చింది. కొంత మంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రస్తావించారు. దీనిపైనే నితీశ్ కాస్త అలక వహించినట్టు సమాచారం. లోపల ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నది స్పష్టత లేకపోయినా ప్రధాని అభ్యర్థి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపైనే రాహుల్ గాంధీ నితీశ్ కుమార్‌కి కాల్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కూటమిలోని కొందరు నేతలకు, నితీశ్ కుమార్‌ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిపాయి. కూటమి పేరుని I.N.D.I.A అని కాకుండా Bharat గా మార్చాలని కొందరు ప్రతిపాదించారు. దీనిపై నితీశ్ కుమార్ కాస్త గట్టిగానే వాదించారట. అంతకు ముందు DMK నేత తమిళ్‌లో మాట్లాడుతూ హిందీలోకి అనువదించాలని కోరారు. దీనిపైనా నితీశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హిందీ నేర్చుకోండి అంటూ మందలించారు. ఇది కూడా కూటమిలో కాస్త అలజడి సృష్టించింది. పైగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ డీలా పడడాన్నీ ప్రస్తావించారు నితీశ్.

విభేదాలున్నా..

నితీశ్ కుమార్‌ని మీడియా చాలా సార్లు ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించింది. "మీరు ప్రధాని అభ్యర్థిగా ఉంటారా" అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు నితీశ్ కుమార్. పెద్దగా ఆసక్తి లేదన్న సంకేతాలిచ్చారు. అయితే..కూటమిలో మాత్రం తనను తాను ప్రధాని అభ్యర్థిగా చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే JDU నేతలు కొందరు నితీశ్ కుమార్‌ ప్రధాని రేసులో ఉన్నారంటూ ప్రచారం చేశారు. ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలూ నితీశ్‌కి ఉన్నాయని తేల్చి చెప్పారు. కొన్ని విభేదాలున్నప్పటికీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశమైతే లేదని అంటున్నారు. ఎన్‌డీఏని ఢీకొట్టేందుకు ఇదో మంచి అవకాశమని, దీన్ని వదులుకోవాలని లేదని అంటోంది ఆ పార్టీ. 

2024 జనవరి మొదటి వారంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ  మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంపీలు ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.  తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.  

Also Read: న్యూజెర్సీలో భారతీయ యువతి అదృశ్యం, నాలుగేళ్లైనా దొరకని ఆచూకీ - FBI కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget