X

PM Modi: 'గత ప్రభుత్వాలు లాకర్లు నింపుకున్నాయి.. మేం పేదల కడుపులు నింపుతున్నాం'

ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 వైద్య కళాశాలలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.

FOLLOW US: 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. సిద్దార్థ్‌నగర్‌లో పర్యటించిన మోదీ 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. 

సిద్ధార్థ్​నగర్​, ఈటాహ్​, హర్దోయ్​, ప్రతాప్​గఢ్​, ఫతేపుర్​, దేవరియా, మీర్జాపుర్​, జౌన్​పుర్​ జిల్లాలో రూ. 2,329 కోట్ల వ్యయంతో ఈ 9 కళాశాలలను నిర్మించారు. కేంద్ర పథకం ద్వారా 8 కళాశాలను ఏర్పాటు చేశారు. జౌన్​పుర్​లోని వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో నిర్మించుకుంది. ఈ వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని.. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.

" ఈ 9 వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. గత ప్రభుత్వాలు పూర్వాంచల్‌ను రోగాలతో బాధపడేలా గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు ఉత్తర భారతావనికే పూర్వాంచల్ మెడికల్ హబ్‌గా మారనుంది. తొమ్మిది కళాశాలలు ఒకసారే ప్రారంభించడం ఎప్పుడైనా జరిగిందా? గత ప్రభుత్వాలకు తమ కుటుంబాల లాకర్లు నింపుకోవడానికి సమయం చాలలేదు. కానీ పేదోడికి డబ్బులు దాచి.. వారికి ఖర్చు చేయడమే మా లక్ష్యం.                                               "
-ప్రధాని నరేంద్ర మోదీ

ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!

Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ

Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: PM Modi Prime Minister Narendra Modi medical colleges PM Modi in UP PM Modi in Varanasi PM Modi in Siddharthnagar

సంబంధిత కథనాలు

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

Omicron Cases Tally: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు... 23కి చేరిన మొత్తం కేసులు

Omicron Cases Tally: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు...  23కి చేరిన మొత్తం కేసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?

Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?