అన్వేషించండి

Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?

Vishal Agarwal Bail : పుణె పోర్షే కేసులో నిందితుడి తండ్రికి బెయిల్ రావడంతో వారు సంబరాలు చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pune Porsche accident celebration video:  పుణె పోర్షే కారు ప్రమాద కేసు.. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ విషాద ఘటన ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. నిందితులకు బెయిల్ రావడం, ఆ తర్వాత వారు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు బయటకు రావడం బాధితుల కుటుంబాల్లో తీరని ఆవేదనను నింపుతోంది.  

2024 మే నెలలో పుణెలో మద్యం మత్తులో ఓ మైనర్ నడిపిన పోర్షే కారు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటనను ఎవరూ మర్చిపోలేరు. ఈ కేసులో విచారణ పేరుతో సాగిన  ప్రహసనం ఇప్పుడు బాధితుల ఆవేదనకు పరాకాష్టగా మారింది. నిందితుడైన మైనర్‌కు అప్పట్లోనే కేవలం రోడ్డు భద్రతపై వ్యాసం రాయాలి  అనే వింత కండిషన్‌తో బెయిల్ ఇవ్వడం ఒక ఎత్తైతే, తాజాగా నిందితుడి తండ్రికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. మరీ ముఖ్యంగా, బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుల కుటుంబం భారీ పార్టీలు చేసుకుంటూ, నోట్ల దండలతో డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. 

 చట్టం అంటే భయం లేదు - బాధితురాలి తండ్రి ఆవేదన

ఈ పరిణామాలపై మరణించిన అశ్విని కోష్ఠ తండ్రి సురేష్ కోష్ఠ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులను చంపి సంబరాలు చేసుకోవడం వారి సమాజంలో అలవాటు కాబోలు.. ఇది సామాన్య పౌరులను అవహేళన చేయడమే అంటూ ఆయన నిప్పులు చెరిగారు. చట్టంలోని లొసుగులను వాడుకుని శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని, మైనర్ అనే ముసుగులో వారు ఏమైనా చేయవచ్చనే ధీమాతో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు హైకోర్టు శిక్ష వేస్తే, సుప్రీంకోర్టు వదిలేస్తోందని.. ఇది నేరస్తులను ప్రోత్సహించడమేనని ఆయన విమర్శించారు.

రక్తంకు రక్తం.. కఠిన చట్టాలు రావాలి!

భారతదేశంలో చట్టం పట్ల భయం పోయిందని, ముస్లిం దేశాల్లో ఉన్నట్లుగా  రక్తంకు రక్తం  అనే కఠిన శిక్షలు అమల్లోకి వస్తేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయని సురేష్ కోష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న ఆయన, నిందితులకు బెయిల్ రద్దు చేయాలని, వారి తల్లిదండ్రులను మళ్లీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకుండా, నిందితులు హీరోల్లా సంబరాలు చేసుకోవడం   మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు.  

సాక్ష్యాల తారుమారు.. అడుగడుగునా కుట్ర!

ఈ కేసు కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, అడుగడుగునా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు జరిగిన కుట్ర అని పోలీసు విచారణలో తేలింది. మైనర్ నిందితుడిని కాపాడేందుకు అతని తల్లిదండ్రులు డాక్టర్లతో కుమ్మక్కై బ్లడ్ శాంపిల్స్ మార్చడం, డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చి నేరాన్ని ఒప్పుకోమని చెప్పడం వంటివి దేశవ్యాప్త ఆగ్రహానికి గురిచేశాయి. తండ్రి విశాల్ అగర్వాల్ సుమారు 22 నెలల పాటు జైలులో ఉండి, తాజాగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. కానీ, బయటకు వచ్చిన వెంటనే ఆ కుటుంబం వ్యవహరిస్తున్న తీరు జనం నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశంపై స్పందించారు.  

 
పుణె పోర్షే కేసు ధనవంతుల అహంకారానికి, చట్టం బలహీనతకు నిదర్శనంగా మిగిలిపోతోంది. సామాన్యుడి ప్రాణానికి వెలకట్టలేని స్థితిలో, చట్టం ధనికుల పక్షాన నిలబడుతోందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget