Viral Video: పుణే ట్రైనీ IAS ఆఫీసర్ తల్లి హల్‌చల్, రైతుల భూములు కబ్జా - అడ్డుకున్న వాళ్లకి గన్‌తో వార్నింగ్
Pune IAS Trainee: పుణే IAS ట్రైనీ పూజా ఖేడ్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆమె తల్లి ఓ రైతుని గన్‌తో బెదిరిస్తున్న పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Pune IAS Trainee Officer: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పుణే ట్రైనీ IAS అధికారి (Puja Khedkar) వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. ఇప్పటికే అధికార దుర్వినియోగంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది పూజా ఖేడ్కర్. ఇప్పుడు ఆమె తల్లి చేసిన పని కూడా వివాదాస్పదమవుతోంది. పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ IAS ఆఫీసర్. కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే పుణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. పక్కనే ఉన్న రైతుల భూముల్నీ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ స్థలం వద్దే పెద్ద గొడవైంది.
ఆ తరవాత పూజా ఖేడ్కర్ తల్లి మనోరమా ఖేడ్కర్ రంగంలోకి దిగింది. సెక్యూరిటీ గార్డులతో ఆ స్థలానికి వచ్చింది. రైతులతో గొడవ పెట్టుకుంది. అంతే కాదు. చేతిలో గన్ కూడా ఉంది. తుపాకీతో వాళ్లను బెదిరించింది. గన్ చూపిస్తూ "ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు" అని బెదిరించింది. అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయ్యుందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకోవాలని తేల్చి చెప్పింది. "నాకే రూల్స్ చెప్పకు" అని తుపాకీతో వార్నింగ్ ఇచ్చింది. ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పోలీస్ కేసు పెడదామని చూసినా ఎవరూ సహకరించలేదని రైతులు చెబుతున్నారు.
Pooja Khedkar IAS : पूजा खेडकर यांच्या आईकडून बाऊन्सर घेऊन शेतकऱ्यांना दमदाटी? जुना व्हिडीओ समोर#poojakhedkarias #iaspoojakhedkar #pune #mulshi #abpmajha #abpमाझा pic.twitter.com/v0brw5xHky
— ABP माझा (@abpmajhatv) July 12, 2024
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పూజే ఖేడ్కర్‌కి 5 ప్లాట్‌లున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలో రెండు అపార్ట్‌మెంట్‌లున్నాయి. వీటి విలువ రూ.22కోట్లు. అహ్మద్‌నగర్‌లో రూ.45 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంట్ ఉంది. ట్రైనింగ్‌లో ఉండగానే గొంతెమ్మ కోరికలు కోరి అందరినీ షాక్‌కి గురి చేసింది పూజా ఖేడ్కర్. సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఆమెపై బదిలీ వేటు వేశారు. ఆమె రిక్రూట్‌మెంట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా లోపం ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ చూపించినట్టు తేలింది. మెడికల్ టెస్ట్‌లు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది. తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్ట్‌లనూ స్కిప్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపైనా విచారణ జరుగుతోంది.
ఇప్పటికే ఆమెని మరో జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అయితే...ప్రైవేట్ ఆడీ కార్‌కి బ్లూ,రెడ్ లైట్ పెట్టించుకుంది పూజా ఖేడ్కర్. అంతే కాదు. VIP నంబర్ ప్లేట్‌తో పాటు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అనే స్టికర్ కూడా వేయించుకుంది. దీనిపైనే విమర్శలు వచ్చాయి. ట్రైనింగ్‌లో ఉండగా ఇదంతా ఎలా చేస్తారంటూ అధికారులు మండి పడ్డారు. పైగా తండ్రి పేరు వాడుకుని ఇదంతా చేసినట్టూ విమర్శలు వస్తున్నాయి. తండ్రి కూడా కూతురు చెప్పిందల్లా వినడమే కాకుండా ఆమె డిమాండ్‌లు నెరవేర్చాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
Also Read: Anant Ambani Wedding: ఏంటి, కొడుకు పెళ్లి కోసం ముకేశ్ చేస్తున్న ఖర్చు అంతేనా - చాలా ఆశ్చర్యంగా ఉందే!