Anant Ambani Wedding: ఏంటి, కొడుకు పెళ్లి కోసం ముకేశ్ చేస్తున్న ఖర్చు అంతేనా - చాలా ఆశ్చర్యంగా ఉందే!
Anant Ambani Radhika Merchant Wedding: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లి కోసం ముకేశ్ అంబానీ చాలా తక్కువగా ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆస్తిలో 0.5% మాత్రమే ఖర్చు చేస్తున్నారు.

Anant Ambani Radhika Merchant Wedding Cost: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు సెలెబ్రిటీలంతా తరలివస్తున్నారు. ఇండియాలో ఎవ్వరూ చూడని స్థాయిలో చాలా గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్ జరుగుతోంది. ఈ పెళ్లి గురించి భారత్‌లోనే కాదు. ప్రపంచ దేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు పలు దేశాల రాజకీయ నేతలకి, అంతర్జాతీయంగా ఉన్న బడా వ్యాపారులకు ఇన్విటేషన్ పంపింది అంబానీ ఫ్యామిలీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీనీ ఆహ్వానించింది. ఈ గెస్ట్ లిస్ట్‌లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన వాళ్లూ ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే అసలు అంబానీ ఈ పెళ్లి కోసం చేస్తున్న ఖర్చు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే కాదు. అంతర్జాతీయంగా కూడా ఇదే హాట్ టాపిక్ (anant ambani wedding news) అయింది. ప్రీవెడ్డింగ్ వేడుకల్నీ రెండు సార్లు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారమైతే కనీసం రూ.4-5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. "వామ్మో ఇంతా" అని మనకి అనిపిస్తుంది కానీ..అంబానీకి ఉన్న ఆస్తిలో ఇది అణువంతే.
#WATCH | Anant Ambani to tie the knot with Radhika Merchant today in Mumbai. Visuals from Antilia - the Ambani residence. pic.twitter.com/IqDj72EpzL
— ANI (@ANI) July 12, 2024
అలా పోల్చుకుంటే ఖర్చు తక్కువే..
ముకేశ్ అంబానీకి ఉన్న మొత్తం ఆస్తి విలువలో(Mukesh Ambani Net Worth) ఇది 0.5% మాత్రమే. ఓ సాధారణ కుటుంబానికి చెందిన తండ్రి తన కొడుకు పెళ్లి కోసం చేసే ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే అన్నమాట. ఎవరి ఆస్తిని బట్టి వాళ్ల ఖర్చుని లెక్కిస్తే ఇది తక్కువగానే కనిపిస్తుంది. అయితే...కొంత మంది ఈ ఖర్చు గురించి అనాలసిస్ కూడా చేస్తున్నారు. ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 123.2 బిలియన్ డాలర్లు. అందులో అనంత్ అంబానీ పెళ్లి కోసం చేస్తున్న ఖర్చు రూ.4-5 వేలు కోట్లు. ఇండియాలో సాధారణ ప్రజలు తమ పిల్లల పెళ్లి కోసం ఆస్తిలో 5-15% మేర ఖర్చు చేస్తారని అంచనా.
రూ.50-కోటి వరకూ ఆస్తి ఉంటే పెళ్లి కోసం రూ.10-15 లక్షల ఖర్చు చేస్తారు. అదే రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉంటే రూ.కోటిన్నర వరకూ పెళ్లి కోసం ఖర్చు పెట్టే అవకాశముంటుంది. ఇలా పోల్చుకుని చూస్తే ముకేశ్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నట్టే లెక్క. తన ఆస్తి మొత్తంలో కనీసం 1% కూడా పెట్టడం లేదన్నమాట. ఇంత తక్కువ ఖర్చు చేస్తేనే సెలబ్రేషన్స్ ఈ రేంజ్‌లో ఉంటే ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి ఉంటే ఇంకా ఏ స్థాయిలో ఉండేదో.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

