అన్వేషించండి

Watch Video: ట్విన్స్ టవర్స్ తరహాలోనే పుణెలోని బ్రిడ్జ్ కూల్చివేత, కొత్త ఫ్లైఓవర్ కోసమట

Watch Video: పుణెలోని చాందినీ చౌక్‌లోని వంతెనను కూల్చివేశారు.

Watch Video:

అర్ధరాత్రి కూల్చివేత..

మహారాష్ట్రలోని పుణెలో 90ల కాలం నాటి బ్రిడ్జ్‌ను కూల్చివేశారు. చాందినీ చౌక్‌లో  ఈ వంతెనను బాంబులు వినియోగించి పడగొట్టారు. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారి (NH4)లో ఉందీ వంతెన. అర్ధరాత్రి 1గంటకు ఈ కూల్చివేత చేపట్టారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు, అక్కడ వాహనాల రద్దీ తగ్గించేందుకు చాందినీ చౌక్ చౌరస్తాను విస్తరించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే...ఈ బ్రిడ్జ్‌ను పడగొట్టారు. ఈ వంతెన స్థానంలో కొత్తగా మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇన్నేళ్ల నుంచి ఉన్న వంతెనను కూల్చివేసే సమయంలో స్థానికులంతా వచ్చి ఆసక్తిగా చూశారు. శిథిలాలను తొలగించేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది. ఇందుకోసం ట్రక్‌లు, ఎర్త్‌మూవర్ మెషీన్లను వినియోగించారు. బ్లాస్ట్‌కు ముందు వాహనాలను ఆ దారిలోకి రాకుండా నిలిపివేశారు. వేరే దారిలో వాటిని మళ్లించారు. ఎక్కువ మంది బ్రిడ్జ్ వద్ద గుమిగూడకుండా...సెక్షన్ 144 అమలు చేశారు.  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో  ఎడిఫిస్ ఇంజనీరింగ్ సిబ్బంది...ఈ కూల్చివేత పనిని చేపట్టింది. ఇదే కంపెనీ గతంలో నోయిడాలోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేసింది. 

600 కిలోల ఎక్స్‌ప్లోజివ్స్..

"బ్రిడ్జ్‌ను రాత్రి 1 గంటకు కూల్చివేశాం. అనుకున్న ప్లాన్ విధంగానే బ్లాస్ట్‌ చేయగలిగాం. ప్రస్తుతానికి ఎర్త్‌మూవర్ మెషీన్లు, ఫోర్క్‌నెయిల్స్, ట్రక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. శిథిలాల్ని తొలగిస్తున్నాం" అని ఎడిఫిస్ ఇంజనీరింగ్ కో ఓనర్ చిరాగ్ చెడా వివరించారు. ఇందుకోసం 600 కిలోల ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. ఈ బ్రిడ్జ్‌ను కూల్చివేసే ముందు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ పనులను ఏరియల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఈ కూల్చివేత పూర్తైన వెంటనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 

గతంలో నోయిడా టవర్స్ కూల్చివేత..

ఆగస్టు 28న నోయిడాలోని ట్విన్ టవర్స్‌ కూల్చివేశారు. అనుకున్న విధంగానే సరిగ్గా 9 సెకన్లలో ఈ టవర్లు నేలమట్టమయ్యాయి. పక్కనే ఉన్న బిల్డింగ్‌లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిపై దుమ్ము, ధూళి పడకుండా పూర్తిగా క్లాత్‌లతో కప్పేశారు. ఈ రెండు టవర్స్‌ని కూల్చేందుకు మొత్తం 3,700 కిలోల బరువైన ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. ఈ టవర్స్‌లోని 7000 హోల్స్‌లో ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చారు. 20 వేల సర్క్యూట్‌లు ఏర్పాటు చేశారు. ట్రిగ్గర్ చేసినప్పుడు ఉన్నట్టుండి ఆ పిల్లర్స్‌ నిలువునా కూలిపోతాయి. దీన్నే "వాటర్ ఫాల్ టెక్నిక్" (Waterfall technique) అంటారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ కూల్చివేత 9 సెకన్లలో పూర్తైంది. ఇది కూలిపోయిన తరవాత వచ్చే దుమ్ము అంతా తేలిపోవటానికి కనీసం 12 నిముషాలు పడుతుంది. ఒకవేళ గాలి బాగా వీస్తే ఇంకా ఎక్కువ సమయమే పడుతుండొచ్చని అధికారులు వివరించారు. దాదాపు 55 వేల  టన్నుల మేర శిథిలాలు పోగవుతాయని అంచనా. వీటిని క్లియర్ చేయటానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ శిథిలాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే డంప్ చేయనున్నారు. ముంబయికి చెందిన Edifice Engineering సంస్థ ఈ కూల్చివేతను చేపట్టనుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: దొంగ ఓట్లతో 2024 ఎన్నికలు.. సీఈసీ జైలుకు వెళ్లక తప్పదు -రాహుల్ గాంధీ
దొంగ ఓట్లతో 2024 ఎన్నికలు.. సీఈసీ జైలుకు వెళ్లక తప్పదు -రాహుల్ గాంధీ
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
Team India Sixes Record: 400 సిక్సర్లతో టీమిండియా వరల్డ్ రికార్డు .. గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలోనూ అరుదైన ఘ‌న‌త‌ 
400 సిక్సర్లతో టీమిండియా వరల్డ్ రికార్డు .. గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలోనూ అరుదైన ఘ‌న‌త‌ 
AP Local Body Elections Live updates: ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget