GST Slabs Rates On Cars: జీఎస్టీ స్లాబుల మార్పు.. ఈవీ రంగంపై కూడా ప్రభావం.. పలు నివేదికలలో ఆసక్తికరమైన అంశాలు
జీఎస్టీ తగ్గిస్తే అటు పెట్రో కార్ల అమ్మకాలు పెరగడంతోపాటు అది ఈవీ రంగంపై కూడా ప్రభావం చూపిస్తోందని పలువురు భావిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన నివేదికలు ఈ విషయంపై స్ఫష్టతనిస్తున్నాయి.

Updated GST Latest News : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపువ వల్ల ఈవీ రంగానికి గడ్డుకాలం ఎదురవబోతోందా..? తాజా అధ్యయనాలు ఈ మార్పునే చూపిస్తున్నాయి. జీఎస్టీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియం, పెద్ద కార్ల బదులు ఈవీ వాహనాలకు మొగ్గు చూపేవారు. అయితే ఇప్పుడు జీఎస్టీ తగ్గుదలతో ఆ ప్రయోజనానికి గండిపడుతోందని తెలుస్తోంది. HSBC ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇటీవలి నివేదిక ప్రకారం, ప్రభుత్వం ICE వాహనాలపై వస్తువులు మరియు సేవల పన్ను (GST)లో ప్రతిపాదిత తగ్గింపుతో ముందుకు సాగితే ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీదారుల కాంపిటీటివ్ నెస్ కి ఎదురుదెబ్బ తగలవచ్చని సమాచారం.
సాంప్రదాయ వాహనాలపై పన్నులను తగ్గించడం వలన EVలు ప్రస్తుతం అనుభవిస్తున్న ధరల ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉందని, దీనివల్ల ఈ రంగం వృద్ధి వేగం మందగించవచ్చని నివేదిక పేర్కొంది. ICE వాహనాలపై పన్నులు తగ్గిస్తే EV ప్లేయర్లు ప్రతికూలతను ఎదుర్కొంటారని నివేదిక వివరాలు వెల్లడించింది. జీఎస్టీ విధానంలో రెండు శ్లాబులను రద్దు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. జిఎస్‌టి కేటగిరీలోని 12 శాతం మరియు 28 శాతం శ్లాబులను తొలగించాలనే కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే చెప్పినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తాజాగా తెలిపారు. జీఎస్టీ తగ్గింపు పెట్రోల్, డీజిల్ వాహనాలకు డిమాండ్‌ను పెంచి, ఉపాధిని పెంచే అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే మార్గానికి దారితీస్తుందని నివేదిక పేర్కొంది.
మూడు రకాలుగా..
జీఎస్టీ శ్లాబుల తగ్గింపు గురించి HSBC నివేదిక మూడు మార్గాలను వివరిస్తుంది. మొదటిదానిలో, చిన్న కార్లపై GSTని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించవచ్చు, అయితే పెద్ద కార్లలో సెస్ తొలగింపుతోపాటు 40 శాతం కొత్త ప్రత్యేక రేటులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీని వలన చిన్న కార్లకు దాదాపు 8 శాతం మరియు పెద్ద వాటికి 3-5 శాతం ధరలు తగ్గుతాయి. ఈ పరిస్థితిలో ద్విచక్ర వాహన తయారీదారులు, ముఖ్యంగా డొమెస్టిక్ తయారీదారులు కూడా గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు, ప్రభుత్వానికి 4-5 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా.
సెస్ కొనసాగిస్తే..
ఇక రెండవ ప్రాబబులిటిీనీ పరిశీలిస్తే, అన్ని వాహనాలపై 28 శాతం నుండి 18 శాతానికి GST తగ్గింపు ఉంటుందని, అదే సమయంలో సెస్‌ను కూడా కొనసాగిస్తుందని నివేదిక అంచనా వేస్తోంది. దీనివల్ల వాహనాల ధరలు 6-8 శాతం తగ్గుతాయి , ప్రభుత్వానికి 5-6 బిలియన్ డాలర్ల ఆదాయానికి గండి పడుతుందని సమాచారం. అయితే, ఇది EVల ధరల ప్రయోజనాన్ని కూడా తగ్గిస్తుందని, ఇందువల్ల మార్కెట్లో వాటికి డిమాండ్ తగ్గుంతుందని నిపుణులు భావిస్తున్నారు.
మూడవ అంశం విషయానికొస్తే GST తగ్గింపు , సెస్ తొలగింపు రెండూ ఉంటాయని, దీని వల్ల కార్ల అమ్మకాలు మరింతగా ఊపందుకుంటాయని తెలుస్తోంది. ఇకపోతే ప్రభుత్వానికి ఆటో రంగం నుండి వచ్చే GST ఆదాయంలో దాదాపు సగం నష్టాన్ని కలిగిస్తుందని తెలుస్తోంది. ఈక్రమంలో జీఎస్టీ తగ్గుదలలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అటు కార్ల రంగంతోపాటు ఇటు ఈవీ మాన్యుఫాక్చరర్లు, వినియోగదారులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.





















