News
News
X

President Ran Away: శ్రీలంక తరహాలో రాత్రికి రాత్రే ఉడాయించిన అధ్యక్షులు ఎంత మందో తెలుసా? లిస్ట్ పెద్దదే!

శ్రీలంకతో పాటు మరి కొన్ని దేశాల్లోనూ, అధ్యక్షులు రాత్రికి రాత్రే పారిపోయారు. ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక సొమ్ముతో ఉడాయించారు.

FOLLOW US: 

అఫ్గాన్‌లోనూ ఇంతే..

పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్లు విదేశాలకు పారిపోవటం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. కానీ..ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోయింది. ఏకంగా అధ్యక్షులే దేశం విడిచి పారిపోతున్నారు. దేశంలో సంక్షోభం రాగానే, మెల్లగా పారిపోవటానికి ప్లాన్ వేసుకుంటున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. రాజీనామా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి జారుకున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో అనిశ్చితి తీవ్రంగా ఉంది కాబట్టి ఇదేదో పెద్ద విషయంలా కనిపిస్తోంది కానీ, గతంలోనూ పలు దేశాల అధ్యక్షులు ఇలానే పలాయనం చిత్తగించారు. దేశ ప్రజల్ని కష్టాల్లో వదిలేసి తమ ప్రయోజనం తాము చూసుకున్నారు. శ్రీలంకకు ముందు అఫ్గనిస్థాన్‌లోనూ ఇదే జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని రాత్రికి రాత్రే ప్రత్యేక చాపర్‌లో దేశం విడిచి పారిపోయాడు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుని, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఏ మాత్రం ఆలోచించకుండా తన దారి తాను చూసుకున్నాడు. తాలిబన్లు తన కోసం వెతుకుతున్నారన్న కబురు అందగానే, ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని వెళ్లిపోయాడు. 169 మిలియన్ డాలర్ల సొమ్ము కూడా పట్టుకుపోయాడు. పైగా ఇలా పారిపోవటాన్ని సమర్థించుకున్నాడు కూడా. అఫ్గాన్‌లో ఇంకా రక్తపాతం సృష్టించాలని అనుకోవటం లేదంటూ ఓ పెద్ద లేఖ రాశాడు. 

అఫ్గాన్‌కు ముందు ఎన్నో దేశాల్లో..

అఫ్గాన్‌కు ముందు కూడా ఇలాంటివెన్నో చరిత్రలో చూడొచ్చు. కొందరైతే భారీ మొత్తంలో కరెన్సీని తీసుకుని పారిపోయారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది తునీషియా అధ్యక్షుడు జైన్ ఎల్ అబిదీన్ బెన్ అలీ గురించే. 2011లో తునీషియాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చింది. 
బెన్ అలీ, తన కుటుంబం, స్నేహితులు మాత్రమే లాభపడే ఆర్థిక విధానాలు అనుసరించాడు. దేశ ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. చదువుకున్న వారికీ సరైన ఉద్యోగాలు దొరకలేదు. దేశమంతా తీవ్ర కష్టాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో బిలియన్ డాలర్ల సొమ్ముతో సౌదీ అరేబియాకు పారిపోయాడు అధ్యక్షుడు బెన్ అలీ. ఇప్పటికీ తునీషియా ప్రజలు...బెన్ అలీ పేరు చెబితే ఆవేశంతో ఊగిపోతారు. 

ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక..

అంతకు ముందు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మాజీ అధ్యక్షుడు మొబుటు సెసె సెకోదీ ఇదే వ్యవహారం. దాదాపు మూడు దశాబ్దాల పాటు మొబుటు పాలనలో నలిగిపోయింది కాంగో. అవినీతితో సతమతమైంది. ప్రజల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తరవాత క్రమక్రమంగా తిరుగుబాటు మొదలైంది. రువాండాలో హింసలు చెలరేగాయి. లక్షలాది మంది చనిపోయారు. అధ్యక్షుడు మొబుటు గద్దె దిగేంత వరకూ హింస కొనసాగుతుందని ఆందోళనకారులు హెచ్చరించారు. ఇక చేసేదేమీ లేక 1997లో 40 మిలియన్ డాలర్ల సొమ్ముతో పాటు, విలువైన వజ్రాలను వెంట పెట్టుకుని పారిపోయాడు మొబుటు. పనామాను పాలించిన మాన్యుయేల్ నోరిగా కూడా ఇదే విధంగా పారిపోయారు. డ్రగ్ ట్రాఫికింగ్ సహా మరికొన్ని నేరాలు చేశాడన్న ఆరోపణలన్నీ నిజమయ్యాక, అమెరికా పనామాను పూర్తిగా అధీనంలోకి తీసుకుంది. ఆ సమయంలో పారిపోవటానికి ప్రయత్నించిన మాన్యుయేల్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో..ఇదన్నమాట సంగతి. 
 
Published at : 13 Jul 2022 11:10 AM (IST) Tags: Sri Lanka Sri Lanka crisis Gotabaya Rajapaksa Presidents Ran Away

సంబంధిత కథనాలు

Bihar BJP JDU Alliance End: రాజీనామాకు నితీశ్ కుమార్ రెడీ- BJPకి హ్యాండ్ ఇచ్చిన జేడీయూ!

Bihar BJP JDU Alliance End: రాజీనామాకు నితీశ్ కుమార్ రెడీ- BJPకి హ్యాండ్ ఇచ్చిన జేడీయూ!

Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

టాప్ స్టోరీస్

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్