News
News
X

PK Counter To Modi : "సాహెబ్‌"కు కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ! అలా జరిగే చాన్సే లేదట

వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావమే ఉండదని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. విజయానంతరం మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

FOLLOW US: 

2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే వస్తాయంటూ ప్రధాని మోదీ ( PM Modi ) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( PK )  కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ పేరను ఎక్కడా ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. "సాహెబ్"గా అభివర్ణిస్తూ  మోదీ వ్యాఖ్యలను త‌ప్పుప‌ట్టారు. మోదీ వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌పై సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకోవ‌డానికి చేసినవే అని ఆరోపించారు. రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలను ( ASssembly Election Results ) బేస్‌ చేసుకొని బీజేపీవైపు ఓటర్లను ఆకర్షించేందుకే ప్రధాని మోదీ తెలివిగా ఇలా మాట్లాడారని అన్నారు. ఈ విషయం సాహెబ్‌కు కూడా తెలుసంటూ  విమర్శలు చేశారు.  2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫలితాలు ఆ ఏడాదిలోని పరిణామాల వల్ల డిసైడ్ అవుతుంది తప్ప రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా కాదని కౌంటర్‌ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపారు. 

ప్రశాంత్ కిషోర్ ( Prasant Kishore ) కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పక్షాలకు పని చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి పని చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా ఏ పార్టీకి పని చేసేందుకు అంగీకరించడం లేదు. కానీ తన ఐ ప్యాక్ ద్వారా దేశంలో అనేక పార్టీలకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ( Congress Party ) చేరుతారని ప్రచారం జరిగినా ఆయన చేరలేదు.  ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే కూటమిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కేసీఆర్‌తో వరుసగా రెండు రోజుల పాటు సమావేశమయ్యారు. మోదీకి  ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలో ఆయన కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అనుకున్నారని కానీ రివర్స్‌లో వచ్చే సరికి ఆయన అంచనాలు తప్పాయన్న భావనలో ఉన్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ పోల్ స్ట్రాటజీ ఈ సారి వర్కవుట్ కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

Published at : 11 Mar 2022 01:44 PM (IST) Tags: Twitter Prime Minister Modi Prashant Kishore Five state elections

సంబంధిత కథనాలు

BJP :  పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ -  గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Bhadrachalam: మళ్లీ ఉప్పొంగుతున్న గోదావరి, మూడో ప్రమాద హెచ్చరిక జారీ - ఈ రూట్స్ అన్నీ బంద్

Bhadrachalam: మళ్లీ ఉప్పొంగుతున్న గోదావరి, మూడో ప్రమాద హెచ్చరిక జారీ - ఈ రూట్స్ అన్నీ బంద్

టాప్ స్టోరీస్

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

Salary Hike: గుడ్‌ న్యూస్‌! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్‌ పెరుగుదల!

Salary Hike: గుడ్‌ న్యూస్‌! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్‌ పెరుగుదల!

1770 Movie : రాజమౌళి శిష్యుడి పాన్ ఇండియా సినిమా - 'వందేమాతరం' సృష్టికర్త బంకించంద్ర 'ఆనంద్ మఠ్' స్ఫూర్తితో

1770 Movie : రాజమౌళి శిష్యుడి పాన్ ఇండియా సినిమా - 'వందేమాతరం' సృష్టికర్త బంకించంద్ర 'ఆనంద్ మఠ్' స్ఫూర్తితో