జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించండి, ఈసీని డిమాండ్ చేసిన పార్టీలు
Polls In Jammu Kashmir: కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి పార్టీ ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
Polls In Jammu Kashmir:
కీలక సమావేశం..
జమ్ముకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ సహా కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలిశారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ప్రమోద్ తివారి, నసీర్ హుస్సేన్ లాంటి కీలక నేతలు ఈసీ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తరవాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్‌లను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని ఈసీ చెప్పినట్టు వెల్లడించారు.
"భారత్‌కు తలమానికమైన రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేయడం మన దురదృష్టం. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం కావాలన్నదే మా డిమాండ్. మొత్తం 13 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను అందరూ అంగీకరించారు. అక్కడ పరిస్థితులంతా చక్కబడితే ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు..? ఈ విషయంలో మేం ఒకే మాటపై ఉన్నాం. వీలైనంత త్వరగా అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిందే"
- ఫరూక్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
Delhi | People of 13 parties from J&K met here today and agreed that the statehood of J&K should be restored. We all are together on the issue of why elections are not being held in J&K when the situation has normalised: NC leader Farooq Abdullah pic.twitter.com/y2tYpuwrsp
— ANI (@ANI) March 16, 2023
Delhi | A delegation of NC and PDP along with Congress leaders meet ECI over the demand for elections in Jammu & Kashmir
— ANI (@ANI) March 16, 2023
ECI has assured us that they're looking into this matter. It's unfortunate that a State which is the crown of India was made a Union Territory. We want a… https://t.co/lseHWhg5Ph pic.twitter.com/7paNkVOavZ
ఇదే సమయంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌కు తామూ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు.
"శ్రీనగర్‌కు వెళ్లేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. అక్కడి ప్రజల బాధను ప్రపంచానికి తెలియజేస్తాం. వారికి భరోసా కల్పిస్తాం"
- శరద్ పవార్, ఎన్‌సీపీ చీఫ్
We all have agreed on issues (of restoration of statehood in J&K and Assembly elections). We all are ready to visit Srinagar to share the pain of the people of J&K and to give them assurance: NCP chief Sharad Pawar, in Delhi pic.twitter.com/K9C5Zd4Jt4
— ANI (@ANI) March 16, 2023
రాష్ట్ర హోదా డిమాండ్..
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నారా..? గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆత్మనిర్భర భారత్‌పై ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ సంకేతాలి చ్చారు నిర్మలా సీతారామన్. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అందుకే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో 42% మేర రాష్ట్రాలకు అందజేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని 41%కి తగ్గించాం. ఇందుకు కారణం...జమ్ము, కశ్మీర్‌ను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించడమే. బహుశా భవిష్యత్‌లో ఎప్పుడైనా జమ్ము, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుండొచ్చు" అని వెల్లడించారు.
Also Read: అదానీ ప్రస్తావన వస్తేనే మోదీ భయపడుతున్నారు, మాట్లాడే హక్కు నాకుంది - కేంద్రంపై రాహుల్ ఫైర్