అన్వేషించండి

Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?

Elections : మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ పార్టీల గందరగోళం ఓటర్లను ఇబ్బంది పెట్టనుంది. ఎందుకంటే అక్కడ 2 శివసేన పార్టీలు, 2 ఎన్సీపీలు వేర్వేరు కూటముల్లో పోటీ చేస్తున్నాయి.

Political parties confusion in Maharashtra elections : భారత రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మహారాష్ట్ర రాజకీయాలు నిరూపిస్తున్నాయి. అక్కడ మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. మహా యుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తూండగా.. ఎన్సీపీ, శివసేన భాగస్వాములు. మహా వికాస్ ఆఘాడిలో ఎన్సీపీ, శివసేన భాగస్వాములే. కాకపోతే పాత యజమానులు ఈ పార్టీలకు కొత్త ఓనర్లు. ఓటర్లకు ఈ సారి ఈ గందరగోళం తప్పదు. 

పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సీట్లు 

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష  మహా వికాస్ అఘాడి మొత్తం 48 స్థానాల్లో 30 లోక్ సభ సీట్లను  కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో రాజకీయం భిన్నంగా ఉంది. రెండు కూటములు .. ప్రతి కూటమిలో మూడు రాజకీయ పార్టీలున్నాయి.   మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 13 సీట్లు గెలుచుకుంది.  బీజేపీ అనుకున్నని స్థానాల్లో గెలవలేకపోయింది. తొమ్మిది సీట్లలో గెలిచింది. తర్వాత ఉద్దవ్ ధాకరే శివసేన పార్టీ 9 సీట్లలో గెలిచింది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 8, ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన షిండే పార్టీ 7 చోట్ల గెలిచింది. ఒక్క చోట ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ గెలిచింది. 

రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం

అన్ని పార్టీలకు ఓటు బ్యాంక్ 

మహారాష్ట్రలో ఎలాంటి  పరిస్థితి ఉందంటే.. ఏ పార్టీకి కనీసం 30 శాతం ఓట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. లోక్ సభ ఎన్నికల సరళిని చూస్తే భారతీయ జనతా పార్టీకి 9 లోక్ సభ సీట్లే వచ్చినా ఆ పార్టీకి ఇరవై ఆరు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. దీనికి కారణం ఎక్కువ సీట్లలో పోటీ చేయడం. అదే అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి న ఓట్లు పదహారు శాతమే. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న శివసేన ఉద్దవ్ ధాకరే, ఎన్సీపీ శరద్  పవార్ పార్టీలకు కలిపి ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చాయి. ఇలా అన్ని పార్టీలు ఓట్లు చీల్చుకున్నాయి. అదే సమయంలో మజ్లిస్ కూడా మహారాష్ట్రలో బలంగానే ఉంది. 

తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?

కూటములు, పార్టీల మధ్య ఓటర్లకు గందరగోళం

మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు మినహా  ఇతర చోట్ల.. రెండు శివసేన పార్టీలు, రెండు ఎన్సీపీ పార్టీలు బరిలో ఉంటాయి. వాటికి వేర్వేరు గుర్తులు అయినప్పటికీ క్యాడర్,ఓటర్లు అంతా ఆ పార్టీకి చెందిన వారే. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పార్టీలను చేతుల్లోకి తీసుకున్న నేతలకు ఇబ్బంది ఎదురయింది. షిండే శివసేన పార్టీ తనదేనని నిరూపించేందుకు కాస్త సీట్లు తెచ్చుకున్నారు కానీ అజిత్ పవార్ మాత్రం ఎన్సీపీ తనదేనని నిరూపించుకోలేక పోయారు. ఒక్క చోటే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోయే తీర్పు.. ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్ ను కూడా తేల్చేస్తాయి. అజిత్ పవార్ తన పార్టీకి మెరుగైన సీట్లు తెట్టిపెట్టలేకపోతే మళ్లీ పార్టీని విలీనం చేసుకోవాల్సిందే. మరోసారి అధికారంలోకి షిండే రాలేకపోతే అందరూ శివసేనలోకే వెళ్లిపోతారు. అందుకే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ఉనికి కూడా కీలకమే 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Embed widget