PM Modi Meeting on Corona: 'ఒమిక్రాన్‌పై పోరాటంలో వ్యాక్సినేషనే అతి పెద్ద ఆయుధం..' సీఎంలతో ప్రధాని మోదీ
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు.
ఓవైపు ఒమిక్రాన్, మరోవైపు కొవిడ్ వ్యాప్తితో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోన్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మోదీ పలు కీలక సూచనలు చేశారు. కరోనాపై పోరాటంలో వ్యాక్సినేషనే అది పెద్ద ఆయుధమన్నారు.
ముఖ్యంగా కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని మోదీ అన్నారు. అయితే దేశ ఆర్థిక రంగాన్ని, సామాన్యుల బతుకుతెరువును దృష్టిలో పెట్టుకుని కొవిడ్ 19పై ఆంక్షలు విధించాలన్నారు. ఇప్పటివరకు కరోనాపై అన్ని రాష్ట్రాలు, కేంద్రంతో కలిసి అద్భుతంగా పోరాడాయని.. ఇలానే ఐకమత్యంగా ముందుకు సాగాలని మోదీ సూచించారు.
ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు.
రికార్డ్ స్థాయిలో కేసులు..
భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 2,47,417 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 216 రోజుల గరిష్ఠానికి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 11,17,531కి పెరిగింది.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి