అన్వేషించండి

e-RUPI Digital Payment: 'ఇ-రూపీ'ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఇ-రూపీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకువచ్చారు.

దేశంలో డిజిటల్‌ చెల్లింపులను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఇ-రూపీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.

" డిజిటల్ ఇ-రూపీ వోచర్ ద్వారా డిజిటల్ కార్యకలాపాలు, డీబీటీ సేవలు మరింత వేగవంతమవుతాయి. పారదర్శకమైన సేవలు దీంతో అందుబాటులోకి వస్తాయి.                 "
-నరేంద్ర మోదీ, ప్రధాని

ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇ-రూపీ కీలక పాత్ర పోషించనుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. లబ్ధిదారులకు పారదర్శకంగా నగదు చేరేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.

ఏంటి ఉపయోగం?

ఇ-రూపీ వ్యవస్థలో ఒక క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తారు. వీటినే ఇ-రూపీగా భావించొచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ లేని వారు వోచర్‌ కోడ్‌ చెప్పినా సరిపోతుంది.

ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్‌, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం ఇకపై లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే బదులు నేరుగా వారి మొబైల్‌ నంబర్‌కే ఈ కూపన్‌ను పంపిస్తారు. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు సైతం ఇ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

వోచర్ మాత్రమే..

గూగుల్‌ పే, యూపీఐ, ఫోన్‌ పే, పేటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల లాగానే ఇ-రూపీ ఒక పేమెంట్‌ ప్లాట్‌ఫాం కాదు. ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. ‎వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు.‎ ప్రస్తుతం 11 బ్యాంకులు ఇ-రూపీ సేవలను అందిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Loans: రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Womens World Cup Winner: దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Advertisement

వీడియోలు

Women's ODI World Cup 2025 Winner India | టీమిండియా గెలుపులో వాళ్లిద్దరే హీరోలు | ABP Desam
World Cup 2025 Winner India | విశ్వవిజేత భారత్.. ప్రపంచకప్ విజేతగా టీమిండియా మహిళా టీమ్ | ABP Desam
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లుకు అన్యాయం జరుగుతోందా.. వాస్తవాలేంటి..!?
బాదుడే బాదుడు.. అమ్మాయిలూ మీరు సూపర్!
India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Loans: రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Womens World Cup Winner: దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Embed widget