అన్వేషించండి
Advertisement
PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సిన ర్యాలీ రద్దయింది. మోదీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్‌లో నిరసన సెగ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఈరోజు జరగాల్సిన మోదీ ర్యాలీ అనూహ్యంగా రద్దయింది. ప్రధాని పర్యటనలో సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఆయన సభకు హాజరుకాలేదని కేంద్ర హోం శాఖ తెలిపింది.
Security breach in PM Narendra Modi's convoy near Punjab's Hussainiwala in Ferozepur district. The PM's convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
— ANI (@ANI) January 5, 2022
ఫిరోజ్పుర్లో మోదీ సభ జరగాల్సి ఉందని కానీ కొన్ని కారణాల వల్ల ఈ సభకు మోదీ హాజరు కావడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా సభా వేదికపై ప్రకటించారు.
అసలేమైంది..?
బుధవారం ఉదయం బతిండ విమానాశ్రయంలో ప్రధాని మోదీ ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి హస్సేన్వాలాకు వెళ్లి హెలికాప్టర్లో స్వాతంత్ర్య సమర యోధులకు నివాళి అర్పించేందుకు వెళ్లారు. వర్షం కారణంగా ఆయన అక్కడ ఇరవై నిమిషాలు వేచి చూడాల్సి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే సభకు వెళ్లే మార్గంలో భద్రతా చర్యలు పటిష్ఠంగా చేపట్టకపోవడం వల్లే ఆయన సభకు హాజరు కాకుండా తిరిగి విమానాశ్రయానికి వెళ్లారని చెప్పింది.
అయితే ప్రధాని మోదీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రధాని మోదీ వెనుదిరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా విమర్శించారు. పంజాబ్‌లో అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేసేందుకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion