PM Modi's Brother Hospitalized: కిడ్నీ సమస్యతో ఆస్పత్రి పాలైన ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్
PM Modi's Brother Hospitalized: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
PM Modi's Brother Hospitalized: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అస్వస్థతకు గుర్యయారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రహ్లాద్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఐదుగురు తోబుట్టువులు ఉండగా.. అందులో ప్రహ్లాద్ నాలుగో వ్యక్తి. ప్రస్తుతం ప్రహ్లాద్ అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అదే నగరంలో ఆయనకు టైర్ షో రూమ్‌ను కూడా ఉంది.
ప్రధాని మోదీకి ఒక సోదరి, నలుగురు సోదరులు ఉన్నారు. సోమ మోదీ, అమృత్ మోదీ, పంకజ్ మోదీ, ప్రహ్లాద్ మోదీ మరియు సోదరి వాసంతి మోదీ. ఆరోగ్య శాఖ నుంచి పదవీ విరమణ చేసిన సోమ మోదీ ప్రధానికి మొదటి అన్నయ్య. ప్రస్తుతం సోమా మోదీ అహ్మదాబాద్‌లో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ రెండో అన్నయ్య పేరు అమృత్ మోదీ. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మెషిన్ ఆపరేటర్‌గా పని చేశాడు. అతను పదవీ విరమణ తర్వాత అహ్మదాబాద్‌లో తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. పంకజ్ మోదీ ప్రధాని మోదీకి తమ్ముడు. తోబుట్టువుల అందరిలో ప్రధాని మోదీ మూడోవాడు. మోదీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేస్తూ సేవలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రహ్లాద్ మోదీ నాలుగో వాడు. పంకజ్ మోదీ ప్రధాని మోదీకి తమ్ముడు. పంకజ్ తన భార్యతో కలిసి గాంధీ నగర్‌లో నివసిస్తున్నాడు. పంకజ్ సమాచార శాఖలో పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పంకజ్ మోదీతో కలిసి జీవించేవారు. అయితే ప్రధాని మోదీ సోదరి వివాహం కాగా.. ఆమె గృహిణిగా ఉంటోంది.
ఇటీవలే ప్రధాని తల్లి హీరాబెన్ మృతి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆమె వయసు 100 సంవత్సరాలు. డిసెంబర్ 28వ తేదీన ఆమె అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ, అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితమే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.
తన తల్లి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘ఒక అద్భుతమైన శతాబ్ది భగవంతుని పాదాలను చేరింది. నా తల్లిని నేను ఎప్పుడూ త్రిమూర్తులుగా భావించాను. ఆమె ఒక నిస్వార్థ కర్మయోగికి ప్రతీక. విలువల స్వరూపం, నిబద్ధతతో కూడిన జీవితం కలిగి ఉన్నారు.’’ అని ట్వీట్ చేశారు. ‘‘తన 100వ పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిసినపుడు నాతో ఒక మాట అన్నారు, పని తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించు, ఎప్పుడూ తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో కూడిన జీవితాన్ని గడపాలి అని చెప్పారు అది ఎప్పుడూ గుర్తుంటుంది’’ అని మరో ట్వీట్ చేశారు.వ తేదీ