PM Modi US Visit: ఆల్కహాల్ అలవాటుపై జోక్ వేసిన బైడెన్, పగలబడి నవ్విన ప్రధాని మోదీ
PM Modi US Visit: ఆల్కహాల్‌పై జో బైడెన్ చెప్పిన జోక్‌కి ప్రధాని మోదీ పగలబడి నవ్వుకున్నారు.
PM Modi US Visit:
అదిరిపోయే విందు..
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22 న వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ డిన్నర్‌లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి డిన్నర్ చేశారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. దాదాపు 400 మంది అతిథులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బైడెన్, మోదీ చాలా జోవియల్‌గా కనిపించారు. ఈ క్రమంలోనే బైడెన్ మోదీపై ఓ జోక్ వేశారు. ఇది విని ప్రధాని మోదీ పగలబడి నవ్వారు. ఆల్కహాల్ తీసుకోకుండానే మోదీ డిన్నర్ ముగించేశారంటూ బైడెన్ అన్న మాటకు మోదీ గట్టిగా నవ్వారు. అంతే కాదు. తమ ఇద్దరికీ ఈ అలవాటు లేదని చెప్పారు.
"మా తాతయ్య నాకో సలహా ఇచ్చాడు. నీ గ్లాస్‌లో వైన్ కాకుండా మరే డ్రింక్ ఉన్నా దాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలని తాగాలని చెప్పాడు. నేనేమీ జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నా. మరో మంచి విషయం ఏంటంటే..మా ఇద్దరికీ ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేదు"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
#WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden, at the State Dinner at the White House. pic.twitter.com/r0LkOADAZ6
— ANI (@ANI) June 23, 2023
స్పెషల్ వంటకాలు..
ఈ కామెంట్స్ చేసిన వెంటనే మోదీ నవ్వారు. ఆ తరవాత పక్కనే ఉన్న ట్రాన్స్‌లేటర్ బైడెన్ కామెంట్స్‌ని హిందీలో అనువదించి చెప్పారు. ఇది విన్నాక ఒక్కసారిగా హాల్‌లో ఉన్న వారంతా నవ్వడం మొదలు పెట్టారు. మోదీ కూడా పదేపదే గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఆ తరవాత బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భవిష్యత్‌లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వెల్లడించారు. రెండు పవర్‌ఫుల్ దేశాలకు ఛీర్స్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని మోదీ కోసం ఏర్పాటు చేసిన విందులో ఎన్నో స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేశారు. మోదీకి అందించనున్న ఫుడ్ ఐటమ్స్ ఏంటో పెద్ద లిస్ట్ కూడా ప్రకటించింది వైట్‌హౌజ్. ప్రతి టేబుల్‌ని భారత త్రివర్ణ పతాకం రంగులో డెకరేట్ చేశారు. మోదీ వెజిటేరియన్ అవడం వల్ల మరింత స్పెషల్ ఐటమ్స్ వండించారు. మిల్లెట్ కేక్, వాటర్‌మెలన్, అవకాడో సాస్, స్ట్రాబెర్రీ కేక్ ఇలా రకరకాల వంటకాలు వడ్డించారు. అగ్రరాజ్యం అమెరికాలో కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగం అందర్నీ మంత్రముగ్దులను చేసింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావిస్తూనే వాటికి పరిష్కారాలను కూడా చెప్పారు మోదీ. అదే టైంలో అమెరికా, భారత్ మధ్య ఉన్న బంధాన్ని ప్రస్తావించారు. ఈ జోడీ ప్రపంచానికి ఎలా సహాయపడగలదో వివరించారు. అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ సభలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం సుమారు గంటపాటు సాగింది. 2016లో చేసిన ప్రసంగం కంటే ఇది చాలా ఎక్కువ. అప్పట్లో 45 నిమిషాలు మాత్రమే మాట్లాడారు మోదీ. ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా అంశాలను తన స్పీచ్‌లో ప్రధాని ప్రస్తావించారు. చాలా సార్లు మోదీ ప్రసంగానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ సహా కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు.
Also Read: Swiss banks: స్విస్ బ్యాంకుల్లో మన వాళ్లు ఎంత డబ్బు దాచారో తెలుసా?