ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
PM Modi: ప్రధాని మోదీకి పాకిస్థానీ సిస్టర్ కమర్ మోసిన్ షేక్ రాఖీ పంపారు. 2024 ఎన్నికల్లోనూ మోదీయే ప్రధాని కావాలని కోరుకున్నారు.
ఆయనే మరోసారి ప్రధాని కావాలి: కమర్ మోసిన్
రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి, పాకిస్థాన్‌లోని తన సోదరి రాఖీ పంపారు. ప్రధానికి "పాకిస్థానీ సిస్టర్‌గా" పిలుచుకునే కమర్ మోసిన్ షేక్..మోదీకి రాఖీ పంపటమే కాకుండా, 2024 ఎన్నికల్లో గెలుపొందాలని విషెస్ కూడా చెప్పారు. ఆమె..ప్రధాని మోదీ గురించి ANIతో మాట్లాడారు. "ప్రధాని మోదీ నన్ను దిల్లీకి ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. రాఖీ పండుగకు అంతా సిద్ధం చేశాను. ఈ రాఖీని నేనే సొంతగా ఎంబ్రాయిరీ డిజైన్‌తో తయారు చేశాను" అని చెప్పారు కమర్ మోసిన్ షేక్. రాఖీతో పాటు ఆమె లేఖ కూడా రాశారు. మోదీ ఆయురా రోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు చేస్తున్న మంచి పనులను కొనసాగించాలని కోరారు. 2024 ఎన్నికల ప్రస్తావన రాగా "మోదీ మరోసారి ప్రధాని అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ పదవికి ఆయన అర్హుడు. ఆయనకు ఆ సమర్థత ఉంది. ప్రధానిగా ఆయనే ప్రతిసారీ గెలవాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. ఇప్పుడే కాదు. గతేడాది కూడా కమర్ మోసిన్ షేక్..ప్రధాని మోదీకి రాఖీ పంపారు. రాఖీతో పాటు రక్షాబంధన్ కార్డ్‌నూ పంపారు. ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన రాఖీని జరుపుకోనున్నారు. అన్న, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు గుర్తుగా ఈ వేడుక చేసుకుంటారు.
PM Modi's Pakistani sister sends rakhi, wishes him for 2024 general election
— ANI Digital (@ani_digital) August 7, 2022
Read @ANI Story | https://t.co/iiNmw2BMlt#PMModi #RakshaBandhan #IndiaPakistan pic.twitter.com/30uOFXtTtS
Also Read: Rabindranath Tagore: ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?
Also Read: Nasa Voyager Golden Record Explained : భూమికే పరిమితం కాని మనిషి స్నేహం | ABP Desam