అన్వేషించండి

G20 Summit: G20 లో మోదీ లేకుండానే అమెరికా ఎమర్జెన్సీ మీటింగ్, ఎందుకు పక్కన పెట్టారు?

G20 Summit: ప్రధాని మోదీకి ఆహ్వానించకుండానే G20 లో అమెరికా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవటంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

G20 Summit: 

మీటింగ్ అందుకేనా..?

తూర్పు పోలండ్ లో జరిగిన క్షిపణి దాడి విధ్వంసం పై చర్చించేందుకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సదస్సులో అమెరికా ఓ ఎమర్జెన్సీ మీటింగ్ ను నిర్వహించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగానే ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ భూభాగంపై రష్యా క్షిపణి ప్రయోగాలు చేస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ఇందుకోసమే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో దేశాలు మరికొన్ని దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రష్యాను నిలువరించాల్సిన అవసరం సహా ఉక్రెయిన్, పోలాండ్ లకు సైన్యం పరంగా ఎలాంటి సహకారం అందించాలి...ఇంకా అక్కడి ప్రజల ప్రాణాలకు పొంచి ముప్పును తప్పించాల్సిన బాధ్యతలు, దౌత్యపరంగా అవలంబించాల్సిన విధానాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశంలో చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ సమావేశానికి భారత్ కు ఆహ్వానం అందకపోవటంపై పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జీ20 కూటమి అధ్యక్షుడిగా భారత ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన టైం లోనే అక్కడే ఇలాంటి ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవటం...పైగా మోడీని పిలవకపోవటంపై వేర్వేరు వార్తలు వచ్చాయి.

ఎన్నో ప్రశ్నలు..

విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోదీ ని అమెరికా అధ్యక్షుడు పక్కనపెట్టారంటూ ప్రొఫెసర్ అశోక్ శ్వైన్ ట్వీట్ చేశారు. అమెరికా నిజంగానే భారత్ ను పక్కనపెట్టిందా లేదా మరే దైనా కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ మీడియా ఇంటరాక్షన్ ను వైట్ హౌస్ పబ్లిష్ చేసింది. అందులో పోలండ్, ఉక్రెయిన్ లకు ఎలా మద్దతుగా నిలబడాలన్న అంశంపై నాటో సభ్య దేశాలు, జీ7 దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు సమావేశమైనట్లు ఉంది. ఇదే విషయాన్ని జో బిడైన్ ట్వీట్ కూడా చేశారు.

కొన్ని అనుమానాలు..

కేవలం నాటో దేశాల మీటింగ్ అయితే జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆ మీటింగ్ లో ఉండటం.. జీ7 దేశాల మీటింగ్ అయితే..జీ20 సదస్సు జరుగుతున్నప్పుడు వేరే కూటమిల సదస్సులు నిర్వహించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . అయితే వైట్ హౌస్ కానీ, ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రధాని మోదీ జీ 20 దేశాల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పక్కనే ఉన్నారు. ప్రధాని మోదీని ఆయన అభినందించారు కూడా. జీ20 అధినేతలంతా కలిసి మాంగ్రూవ్ ప్లాంటేషన్ చేసినప్పుడు మోదీ పక్కనే జో బైడెన్ ఉన్నారు. అంతే కాకుండా జీ20 కూటమి ప్రస్తుత అధ్యక్షుడు మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తో  జో బైడెన్ ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. ఈ భేటీ ఇరు దేశాలకు మేలు చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

Also Read: War Politics : రాజకీయ పార్టీల ధర్మయుద్ధాలన్నీ ఓట్ల కోసమేనా? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయరా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget