PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను సందర్శించిన మోదీ- పలు ప్రాజెక్టులకు శ్రీకారం
PM Modi Kedarnath Visit: ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను సందర్శించారు.
![PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను సందర్శించిన మోదీ- పలు ప్రాజెక్టులకు శ్రీకారం PM Modi Kedarnath Visit Modi Offers Prayers At Kedarnath Temple, Lays Foundation Stone For Ropeway Project PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను సందర్శించిన మోదీ- పలు ప్రాజెక్టులకు శ్రీకారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/21/b346c136299eab051e11856db7571acc1666331083253218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Kedarnath Visit: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. ఉదయం కేదార్‌నాథ్ చేరుకున్న మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
#WATCH | PM Narendra Modi performs 'puja' at the Kedarnath Dham
— ANI (@ANI) October 21, 2022
(Source: DD) pic.twitter.com/9i9UkQ5jgr
ప్రత్యేక వస్త్రధారణలో
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించి మోదీ ఆలయ దర్శనం చేసుకున్నారు. ఈ డ్రెస్సును ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ.. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా అక్కడి స్థానిక మహిళలు ఆయనకు ఇచ్చారు. ఎంతో అభిమానంతో ఇచ్చిన ఈ దుస్తులను మోదీ.. కేదార్‌నాథ్ ఆలయ సందర్శన సమయంలో వేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు.
అనంతరం అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శ్రమజీవిలతో ప్రధాని మోదీ సంభాషించారు. వారి సొంత రాష్ట్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి చర్చించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారా అని మోదీ వారిని అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Kedarnath, Uttarakhand: PM Modi had a free-wheeling interaction with shramjeevis working on development projects. He asked them about their native states, benefits of govt welfare schemes & also enquired about their Covid vaccination status pic.twitter.com/ZIahwdfsDJ
— ANI (@ANI) October 21, 2022
బద్రినాథ్
Uttarakhand | PM Narendra Modi arrives in Badrinath along with CM Pushkar Singh Dhami & Governor Lt Gen (Retd) Gurmeet Singh pic.twitter.com/sNpUdattIt
— ANI (@ANI) October 21, 2022
కేదార్‌నాథ్‌ను సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ.. బద్రీనాథ్ చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట సీఎం పుష్కర్ సింగ్ ధామీ, గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ కూడా ఉన్నారు.
అభివృద్ధి పనులు
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. అంతే కాకుండా రూ.3400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 9.7 కిలోమీటర్ల రోప్‌వే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read: Viral Video: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన వైద్యులు- బాధితుడు మృతి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)