అన్వేషించండి

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభించిన ప్రధాని, దేశంలో తొలి ఎలివేటెడ్ హైవే ఇదే

Dwarka Expressway: హరియాణాలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

Dwarka Expressway Inauguration: ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలో దేశంలోనే తొలి ఎలివేటెడ్ హైవే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేని (Dwarka Expressway) ప్రారంభించారు. 8 వరుసల ఈ స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడం వల్ల ఢిల్లీ-గుడ్‌గావ్ మధ్య ట్రాఫిక్ రద్దీని భారీగా తగ్గించనుంది. అంతే కాదు. ప్రయాణాన్నీ సులభతరం చేయనుంది. మొత్తం 19 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం కేంద్రం రూ.4,100 కోట్లు ఖర్చు చేసింది. హరియాణా సెక్షన్‌లో రెండు ప్యాకేజ్‌లున్నాయి. ఢిల్లీ హరియాణా బార్డర్ నుంచి బసాయ్ ROB వరకూ ఒకటి, బసాయ్ ROB నుంచి ఖేర్కీ దౌలా వరకూ మరోటి నిర్మించారు. మొత్తం 19 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే స్ట్రెచ్ హరియాణా పరిధిలో ఉండగా..దాదాపు 10 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వే ఢిల్లీ పరిధిలో నిర్మించారు. ఈ మొత్తం స్ట్రెచ్‌ కోసం రూ.9 వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై నాలుగు మల్టీ లెవెలె ఇంటర్‌ ఛేంజెస్ ఉంటాయి. టన్నెల్స్, అండర్‌పాస్‌లు నిర్మించారు. ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌తో పాటు ఫ్లైఓవర్ పై మరో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టారు. సింగిల్ పిల్లర్‌పై ఇంత పెద్ద ఎలివేటెడ్ రోడ్‌ని నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి. ద్వారకా సెక్టార్ 25లో ఉన్న India International Convention Centre (IICC) కి నేరుగా అనుసంధానిస్తోంది ఈ ఎక్స్‌ప్రెస్‌ వే. హైవే ప్రాజెక్ట్‌ల కోసం రూ.లక్ష కోట్లు కేటాయించిన మోదీ సర్కార్ అన్ని రాష్ట్రాల్లోనూ రహదారులు నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే ఈ హరియాణా ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించింది. ఇది Bharatmala Project లో భాగమే.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వేల కోట్ల విలువైన ఈ కీలక ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తుంటే కాంగ్రెస్‌కి, ఆ పార్టీ మిత్ర పక్షాలకు కడుపు మండిపోతోందని, వాళ్లు తట్టుకోలేకపోతున్నారని మండి పడ్డారు. వాళ్లకి కనీసం నిద్ర కూడా పట్టడం లేదంటూ సెటైర్లు వేశారు. పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు.

"లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించుకుంటుంటే కాంగ్రెస్‌కి ఆ పార్టీ మిత్ర పక్షాలకు కడుపు మంటగా ఉంది. కనీసం కంటి నిండా నిద్ర కూడా పోవట్లేదు వాళ్లు. ఈ ప్రాజెక్ట్‌లే వాళ్లకు సమస్య తెచ్చి పెడుతున్నాయి. కేవలం ఎన్నికల కోసమే నేను ఇదంతా చేస్తున్నానని విమర్శిస్తున్నారు. పదేళ్లలో భారత్‌ ఎంతో పురోగతి సాధించింది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు"

- ప్రధాని నరేంద్ర మోదీ

టాప్ హెడ్ లైన్స్

Palnadu Road Accident: హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
Breaking News: రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పు - కమర్షియల్ LPG మరింత చౌక, డొమెస్టిక్ సిలిండర్ రేటు ఎంతంటే?
జులై తొలి రోజే గుడ్‌న్యూస్ - భారీగా తగ్గిన గ్యాస్ బండ ధర, జనానికి భారీ ఊరట

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Embed widget