టెంట్‌లో ఉన్న రాముడికి మందిరమే సిద్ధమైంది, ఇది ఆధునిక అయోధ్యకు అంకురార్పణ - ప్రధాని మోదీ
PM Modi Ayodhya Visit: జనవరి 22న జరిగే అయోధ్య ఉత్సవం కోసం ప్రపంచమే ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు.
Modi Ayodhya Visit:
ప్రపంచమంతా ఎదురు చూస్తోంది..
అయోధ్యలో పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరవాత ఓ సభలో పాల్గొన్నారు. అయోధ్య ప్రజలు తనకు ఘన స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వందల సంవత్సరాల కల జనవరిలో నెరవేరబోతుందని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలలాగే తానూ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. జనవరి 22న జరిగే ఆ మహత్తర ఘట్టం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని అన్నారు. ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందని స్పష్టం చేశారు.
"జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం మొత్తం ప్రపంచమే ఎదురు చూస్తోంది. దేశం అభివృద్ధి పరంగా ఎంత వేగంగా దూసుకెళ్లినా సరే తమ సంస్కృతినీ కాపాడుకోవాలి. ఇన్నాళ్లూ అయోధ్య రాముడు ఓ చిన్న టెంట్‌లో ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం మందిరమే కట్టాం"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "Whatever be the country in the world if it has to reach new heights of development, it will have to take care of its heritage. Ram Lala was there in a tent, today pucca house has been given to not only Ram Lala but also to… pic.twitter.com/oXRTvnPfE8
— ANI (@ANI) December 30, 2023
అయోధ్య ధామ్ జంక్షన్‌తో పాటు ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటారని అన్నారు. అందుకే విమానాశ్రయానికి ఆ మహర్షి పేరు పెట్టామని తెలిపారు. అయోధ్య రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక 70 వేల మంది ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. ఆలయాల పునర్నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ భారత్ దూసుకుపోతోందని స్పష్టం చేశారు. అయోధ్యలో కొత్త టౌన్‌షిప్ నిర్మాణం జరుగుతోందని ప్రకటించారు. తొలి అమృత్ భారత్ రైలు అయోధ్య నుంచే ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయోధ్య ధామ్ జంక్షన్‌తో పాటు ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటారని అన్నారు. అందుకే విమానాశ్రయానికి ఆ మహర్షి పేరు పెట్టామని తెలిపారు. అయోధ్య రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక 70 వేల మంది ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు.
ఆలయాల పునర్నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ భారత్ దూసుకుపోతోందని స్పష్టం చేశారు. అయోధ్యలో కొత్త టౌన్‌షిప్ నిర్మాణం జరుగుతోందని ప్రకటించారు. తొలి అమృత్ భారత్ రైలు అయోధ్య నుంచే ప్రారంభమవుతుందని వెల్లడించారు. సరయూ తీరంలో కొత్త ఘాట్‌ల నిర్మాణం చేపడతామని తెలిపారు. జనవరి 22న కార్యక్రమానికి అందరూ హాజరు కావడం సాధ్యం కాకపోవచ్చని..ప్రాణప్రతిష్ఠ జరిగిన తరవాత అప్పుడు వచ్చి అందరూ రాముడిని దర్శించుకోవాలని సూచించారు. ఈ రామ మందిర నిర్మాణ అయోధ్య వాసుల కష్టానికి ప్రతిఫలం అని తేల్చి చెప్పారు. దేశ చిత్రపటంలో అయోధ్యను ప్రత్యేకంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అయోధ్య స్ఫూర్తిగా మారనుందని అన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికీ సులభంగా రాముడి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: PM Modi Ayodhya Visit: అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ