PM Modi Awarded: ప్రధాని మోదీకి అత్యున్నత అవార్డులు, ద్వీప దేశాల్లోనూ అదే క్రేజ్
PM Modi Awarded: ప్రధాని నరేంద్ర మోదీకి ఫిజీ, పపువా గినియా దేశాలు అత్యున్నత పురస్కారాలు అందించాయి.
PM Modi Awarded:
పసిఫిక్ ఐల్యాండ్స్ సదస్సులో..
ప్రధాని నరేంద్ర మోదీకి భారత్‌లోనే కాదు. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. ఇటీవలే జపాన్‌లోని హిరోషిమాలో G7 సదస్సుకి హాజరైన ఆయన...అక్కడి నుంచి పపువా న్యూ గినియా కు ( Papua New Guinea) వెళ్లారు. అక్కడ నిర్వహించిన మూడవ ఇండియా ఫసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ FIPIC సదస్సులో పాల్గొన్నారు. పపువా రాజధాని పోర్ట్ మోర్సబేలో జరిగిన ఈ సదస్సులో పపువా న్యూ గినియా, ఫిజి, పలావు, కిరిబాటీ సహా 14 ద్వీప దేశాలు పాల్గొన్నాయి. ఫసిఫిక్ మహా సముద్రం ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేలా గత పర్యటనలో FIPIC ని లాంఛ్ చేసిన ప్రధాని మోదీ..ఇప్పుడు ఆయనే నేరుగా సమావేశంలో పాల్గొనడనం వల్ల ఆయా ద్వీప దేశాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ తో (The Companion of the Order of Fiji)మోదీని సత్కరించింది. ఫిజీ ప్రధాని సిటివేని రబుకా మోదీ మెడలో వేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం స్పందించింది. అరుదైన గౌరవం లభించిందంటూ ట్వీట్ చేసింది.
"భారత్‌కి ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఫిజీ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించారు. అత్యున్నత పురస్కారమైన Companion of the Order of Fiji పురస్కారాన్ని అందించారు. అంతర్జాతీయంగా ఆయన లీడర్‌షిప్‌ని గుర్తిస్తూ ఇలా సత్కరించింది. ఈ అవార్డుని ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశ ప్రజలకు అంకితం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు"
- ప్రధాని కార్యాలయం ట్విటర్ హ్యాండిల్
PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm
— PMO India (@PMOIndia) May 22, 2023
అటు పపువా గినియా కూడా ప్రధానికి అత్యున్నత పురస్కారం అందించింది. Grand Companion of the Order of Logohu (GCL) అవార్డుతో సత్కరించింది. పసిఫిక్ ఐల్యాండ్ దేశాలను ఒక్కటి చేయడంలో ప్రధానిమోదీ కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు ఇచ్చినట్టు వెల్లడించింది. ఆ ఐల్యాండ్‌కు చెందని వాళ్లలో ఈ అవార్డు పొందిన వాళ్లు చాలా అరుదు. ఇప్పుడీ లిస్ట్‌లో మోదీ చేరారు. అంతకు ముందు పపువా న్యూ గినియా ప్రధాని, మోదీ కాళ్లకు దండం పెట్టి మరీ దేశానికి ఆహ్వానించారు.
Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D
— PMO India (@PMOIndia) May 22, 2023
Also Read: Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,బీజేపీకి గట్టి కౌంటర్