PM Modi Address LIVE: 'మేడ్ ఇన్ ఇండియా' మంత్రం.. ఐకమత్యంతోనే సాధ్యం: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీపై జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
LIVE

Background
మేడ్ ఇన్ ఇండియా..
ఇప్పటివరకు ఆ దేశం ఇది తయారు చేసింది, ఈ దేశం ఇది తయారు చేసింది అని విన్నాం. కానీ ఇక ఏది చూసినా 'మేడ్ ఇన్ ఇండియా' అని ఉండటం చూస్తున్నాం. ఇది భారత్ సాధించిన ఘనత
- ప్రధాని నరేంద్ర మోదీ
క్రమశిక్షణగా సాగుతోంది..
భారత్ సాధించిన ఈ ఘనత చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. భారత్ ఐకమత్యమే ఇందుకు కారణం. చాలా క్రమశిక్షణగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
There were apprehensions over our vaccination program. It was also being said about India that how will discipline work here: PM Modi on India achieving 100-crore vaccination mark pic.twitter.com/rFyebeT5bZ
— ANI (@ANI) October 22, 2021
అనుమానాలు పటాపంచలు..
[quote author=ప్రధాని నరేంద్ర మోదీ]కరోనా మహమ్మారి వచ్చినప్పుడు.. అసలు భారత్ వ్యాక్సిన్ కనుగొట్టుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దేశం ఈనాడు ఉన్న పరిస్థితి చూస్తే దేశ ప్రజలు గర్వంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూశాం. పేదలు, ధనికులు ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇది ఎలా సాధించారని అనుకుంటున్నాయి. దీనికి ఒకే ఒక కారణం. అందరినీ కలుపుకొని వెళ్లడమే. [/quote]
India's vaccine campaign is a living example of 'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas': PM Modi addresses the nation on 100 crore vaccination feat pic.twitter.com/Y2jyhdKPr9
— ANI (@ANI) October 22, 2021
100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు..
100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం సాధించిన ఘనతపై గర్వంగా ఉందన్నారు.
మోదీ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

