అన్వేషించండి

PM Kisan : తెలుగు రాష్ట్రాల రైతులకు గుడ్ న్యూస్ - బుధవారం ఖాతాల్లో కానున్న నగదు !

PM Kisan : పీఎం కిసాన్ నిధులు బుధవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో రెండు వేలు జమ అవుతాయి.


PM Kisan  :  తెలుగు రాష్ట్రాలరైతులకు శుభవార్త . బుధవారం రైతుల ఖాతాలోకి రూ.2,000 జమ కానున్నాయి.  రైతులకు కేంద్ర ప్రభుత్వం ( central Governament ) పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు అందిస్తుంది. పంట పెట్టుబడికి, ఎరువులు కొనుగోలుకు, వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక సాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగి ఉన్న ప్రతి రైతుల కుటుంబాలకు ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో రూ. 6000 ఆర్థిక సాయం చేయనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం….. లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలని సూచించింది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనకి సంబంధించిన 15వ విడత డబ్బులను ఎల్లుండి రైతుల ఖాతాలో జమ చేయనుంది.   దేశవ్యాప్తంగా 28 లక్షల మంది రైతుల  ఖాతాల్లో నగదు జమ అవుతుంది. 

15వ విడత విడుదల చేయనున్న మోదీ 

ఈ ఏడాది జూలైలో  స్కీమ్‌కి సంబంధించిన 14 వ విడత నిధులను విడుదల చేసింది. ఇప్పుడు పదిహేనో విడత విడుదల చేస్తున్నారు.  ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందేందుకు మీ పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాతో.. ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రైతులు  ఆధార్‌తో బ్యాంక్ వివరాలను లింక్ చేయడానికి eKYC చేయాల్సి ఉంటుంది. దీనిని అప్డేట్ చేసిన వాళ్ల ఖాతాలోనే నగదు  జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు ప్రకటించాయి. eKYC చేయించని వారిని   లబ్ధిదారులు జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. వెంటనే eKYCని చేయించడం ద్వారా లబ్థిని పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు.

ఈ కేవైసీని ఇలా పూర్తి చేయవచ్చు 

 eKYC చేసుకోవడం కోసం PM-KISAN పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ లింక్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో మీ ఆధార్ కార్డ్ 12 నంబర్లను నమోదు చేస్తే ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఆ పోర్టల్లో ఎంటర్ చేస్తే మీ ఆధార్ విజయవంతంగా లింక్ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో   నుండి PMKISAN GOI యాప్‌ను డౌన్‌లోడ్ చేసి కూడా మీ eKYC ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేకుంటే దగ్గర్లోని ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కూడా ఆధార్ ను అకౌంట్‌తో లింక్ చేయవచ్చు. రైతు ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డును ఏటీఎంలో స్వైప్ చేసి పిన్ నంబర్ నమోదు చేయాలి. సర్వీసెస్ అనే ఆఫ్షన్ ఎంపిక చేసుకొని రిజిస్ట్రేషన్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తరువాత మీది సేవింగ్స్ అకౌంటా.. కరెంట్ అకౌంటా.. అని అడుగుతుంది. దానికి సంబంధించిన వివరాలతో ముందుకు వెళ్లాలి. ఆ తరువాత ఆధార్ నంబర్‌ను పొందుపరిస్తే.. ఆధార్‌కి సంబంధించిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇలా చేసిన వెంటనే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయబడినట్లు ఒక మెసేజ్ వస్తుంది. దాంతో నగదు జమ అవుతుంది. 

ఏపీలో పీఎం కిషన్ పథకాన్ని రైతు భరోసాతో అనుసంధానం చేశారు. ప్రభుత్వం రెండు వేలు, కేంద్రం రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు బటన్ నొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు జమ అయినా పీఎం కిసాన్ నిధులు విడుదల కాకపోవడంతో జమ కాలేదు. బుధవారం ఆ నిధులన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget