అన్వేషించండి

Posani Vs Janasena: పోసానిపై జనసేన ఫిర్యాదు.. లీగల్‌ ఒపీనియన్‌ కోరిన పోలీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోసాని కృష్ణ మురళిపై జనసేన కార్యకర్తలు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. జనసేన పార్టీ నేతలు, పవన్ అభిమానులు పోసాని వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోసానిపై జనసేన కార్యకర్తలు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై లీగల్‌ ఒపీనియన్‌ కోరినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. న్యాయ సలహా వచ్చాక ఫిర్యాదుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

Also Read: Pawan Kalyan Vs Posani: పవన్, పోసాని వివాదంపై స్పందించిన నాగబాబు.. ఫన్నీ మీమ్స్‌తో సమాధానం

జనసేన వర్సెస్ పోసాని .. అసలేం జరిగిందంటే?
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న జనసేన అధినేత పవన్.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సినీ, రాజకీయ అంశాలను ముడిపెడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, కొందరు మంత్రులపై పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని.. పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ నేతలు, పవన్ అభిమానులు పోసానిపై విరుచుకుపడ్డారు. 

Also Read: Diversion Politics : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?

పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం.. 
పవన్ కల్యాణ్ అభిమానులు తన భార్య, ఇతర కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మరో ప్రెస్‌మీట్ పెట్టారు. పోసాని ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. పోసానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు హాని ఉందని పోసాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. అక్కడ ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా కొంతమంది పోసానిని వెళ్లనీయకుండా కూడా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పోసానిపై నాగబాబు మీమ్స్..  
పోసాని వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఇన్‌స్టాగ్రాంలో ‘ఆస్క్ మీ’ అనే పేరుతో నాగబాబు చిట్ చాట్ నిర్వహించారు. ‘పోసాని గురించి ఒక్క మాట’ అని ఒక వ్యక్తి అడగగా... ‘సమరసింహారెడ్డి’ సినిమాలో ‘కుక్క మొరిగిందనుకో’ అని బాలయ్య చెప్పే సన్నివేశం ఫొటోను పోస్ట్ చేశారు. ఇక ఇదే విషయంపై జనసేన నేత నిహారిక కాస్త ఘాటుగా స్పందించారు. పోసానిని మానసిక రోగిగా అభివర్ణించారు. ఆయనను వెంటనే మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని ఎద్దేవా చేసింది. 

Also Read: Pavan In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?

Also Read: Krishnapatnam Anandayya: 'అన్నీ కుదిరితే ఎమ్మెల్యే అవుతా'.. ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పెడతారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget