Sena's Sanjay Raut Arrested: ఆ చట్టం కిందే సంజయ్ రౌత్ అరెస్ట్- కస్టడీ కోరనున్న ఈడీ
Sena's Sanjay Raut Arrested: పీఎమ్‌ఎల్‌ఏ చట్టం కింద శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Sena's Sanjay Raut Arrested: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Mumbai | Earlier visuals from the residence of Shiv Sena leader Sanjay Raut, when he was taken to the ED office after being detained by the officials, yesterday (31.07) pic.twitter.com/5dQVqBMJ0s
— ANI (@ANI) August 1, 2022
సోమవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
కోర్టులో
సంజయ్ రౌత్‌ను పీఎమ్‌ఎల్‌ఏ కోర్టులో సోమవారం హాజరు పరచనున్నారు. ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
సోదాలు
ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబయి బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకున్నారు. ముంబయిలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. ఆయన నివాసంలో దొరికిన రూ.11.5 లక్షలను సీజ్ చేశారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 39 మంది మృతి
Also Read: IT Returns 2022: చివరి రోజు ఐటీ రిటర్నుల వెల్లువ, ITR ఫైల్ ల్ చేయని వారికి జరిమానా !