Tejas Express: తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకునే వారికి అదిరిపోయే ఆఫర్
తేజస్ ఎక్స్‌ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఐఆర్ సీటీసీ యూజర్లు ఏస్ బీఐ ప్రీమియం లాయల్టీ కార్డును యూజర్ ఐడీకి లింక్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా?
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) వచ్చే నెల నుంచి నడుపుతున్న రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అయితే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలనుకునేవారికి ఓ శుభవార్త చెప్పారు రైల్వే అధికారులు. ఈ ఎక్స్ ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకోవం ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందే పథకాన్ని ప్రారంభించారు. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.... తేజస్ లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ పథకాన్ని తొలిసారిగా ప్రారంభిస్తోంది. ఈ రెండు తేజస్ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు ఐఆర్సీటీసీ- ఎస్బీఐ ప్రీమియం లాయల్టీ కార్డ్ ఉపయోగించి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఐఆర్‌సిటిసి ఎస్‌బిఐ ప్రీమియం కార్డు తీసుకున్న 45 రోజుల్లోపు తేజస్ ఎక్స్‌ప్రెస్ ద్వారా బుకింగ్ చేసుకుంటే 500 రివార్డ్ పాయింట్లు ఇస్తారు. అదికూడా టికెట్‌ను రద్దు చేయకుండా ప్రయాణం పూర్తి చేసిన ఐదు రోజుల తర్వాత ప్రయాణికులకు ఈ పాయింట్లు వస్తాయి. ఐఆర్‌సిటిసి ఎస్‌బిఐ ప్రీమియం కార్డు ద్వారా రెండోసారి బుకింగ్ చేసుకుంటే, ప్రయాణానికి కార్డ్ హోల్డర్‌కు రూ .100 కు 15 పాయింట్లు ఇస్తారు. వీటిపై బుక్ చేసుకున్న టికెట్లు రద్దుచేయడం కుదరదు. ఇలా టికెట్ ధరపై 15 శాతం తగ్గింపు లభిస్తుంది. జనవరి 1 డిసెంబర్ 31 మధ్య గరిష్టంగా 1500 రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. Irctc.co.in లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ ఉపయోగించి రివార్డ్ పాయింట్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు.
ఈ లాయల్టీ పాయింట్లను ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ www.irctc.co.in , మొబైల్ యాప్ ఐఆర్‌సిటిసి రైల్ కనెక్ట్ ద్వారా ఎసి తరగతుల్లో రైల్ టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించవచ్చు. లాయల్టీ పాయింట్లను పొందడానికి, ఐఆర్‌సిటిసి యూజర్లు ఐఆర్‌సిటిసి ఎస్‌బిఐ ప్రీమియర్ లాయల్టీ కార్డును తమ యూజర్ ఐడితో లింక్ చేయాలి. ప్రస్తుతానికి ఢిల్లీ-లక్నో-ఢిల్లీ (82501-82502)మార్గంలో ఒకటి.... అహ్మదాబాద్-ముంబై-అహ్మదాబాద్ (82501-82502)మార్గంలో మరొక తేజస్ ఎక్స్‌ప్రెస్ నడవనున్నాయి. అధిక ఛార్జీలు మాత్రమే కాదు.... తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు అద్భుతమైన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. క్యాబ్ సర్వీసెస్ మొదలు....హోటల్ బుకింగ్స్, కాంబో భోజనం, ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్స్, టీ అండ్ కాఫీ వెండింగ్ మెషీన్లు, రైలు ఆలస్యం పరిహారం, సిబ్బంది సేవ కోసం కాల్ బటన్లు సహా ఇతర సౌకర్యాలను కూడా ప్రయాణికులకు అందిస్తున్నారు.
కొత్త ఐఆర్‌సిటిసి ఎస్‌బిఐ కార్డ్ ప్రీమియర్ కార్డులు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 56767 కు SMS TRAIN పంపడం ద్వారా వారు మొబైల్ నంబర్ల ద్వారా కార్డుకు సభ్యత్వాన్ని పొందవచ్చు. మరింకెందుకు ఆలస్యం..తెజస్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకునే ముందు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఓసారి చూసుకుని..ప్రొసీడ్ అవండి....