అన్వేషించండి

ఫ్లైట్‌లో బీడీ తాగిన ప్రయాణికుడు, వాసన భరించలేక ఇబ్బంది పడిన ప్యాసింజర్స్

IndiGo Flight: ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ బీడీ తాగి అందరినీ టెన్షన్ పెట్టాడు.

 IndiGo Passenger Smokes Bidi: ఇండిగో ఫ్లైట్‌లో బీడీ తాగిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ముంబయి విమానంలో ఈ ఘటన జరిగింది. రెస్ట్‌రూమ్‌లో ఓ ప్యాసింజర్ బీడీ తాగినట్టు సిబ్బంది వెల్లడించింది. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైనట్టు తెలిపింది. ఆ వ్యక్తిని మందలించింది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరవాత పోలీసులకు అప్పగించారు. ఉన్నట్టుండి ఫ్లైట్‌లో బీడీ వాసన విపరీతంగా వచ్చిందని సిబ్బంది స్పష్టం చేసింది. రెస్ట్‌రూమ్‌లోని ప్యాసింజర్ పొగతాగుతున్నట్టు గుర్తించింది. Aircraft Act కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ విమానాల్లో ఇలా సిగరెట్‌లు తాగి అలజడి సృష్టించిన ఘటనలు వెలుగు చూశాయి. గతేడాది ఆగస్టులో దుబాయ్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ వ్యక్తి రెస్ట్‌రూమ్‌లో సిగరెట్ తాగాడు. అక్కడే సిగరెట్‌ ముక్కలు కనిపించినట్టు విచారణ జరిపిన అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తిని గట్టిగా నిలదీసిన తరవాత లైటర్‌తో పాటు సిగరెట్‌ ప్యాకెట్‌లు ఇచ్చాడు. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అంతకు ముందు గతేడాది మార్చిలో కోల్‌కత్తా నుంచి బెంగళూరుకి వస్తున్న ఇండిగో ఫ్లైట్‌లోనూ ఓ ప్రయాణికుడు పొగతాగి అందరినీ టెన్షన్ పెట్టాడు. భద్రతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేశారు. 

ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ ఏరియాలో బొద్ధింకలు కనిపించడం అలజడి సృష్టించింది. ఫ్లైట్స్‌లో హైజీన్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అన్న కొత్త వాదనకు ఈ ఘటన తెర తీసింది. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్‌ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇండిగో ఫ్లైట్‌లో తనకు బొద్ధింకలు కనిపించాయని చెప్పాడు. ఫ్లైట్స్‌ని హైజీన్‌గా ఉంచాలన్న విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ మండి పడ్డాడు. ఈ పోస్ట్‌లో ఇండిగో అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్‌ వైరల్ అయింది. నెటిజన్లు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై IndiGo స్పందించింది. అప్పటికప్పుడు అన్ని ఫ్లైట్స్‌ని క్లీన్ చేయించింది. పురుగులు లేకుండా డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. అంతరాయం కలిగినందుకు క్షమించాలంటూ ఆ ప్యాసింజర్‌ని కోరింది.

"ఇండిగో ఫ్లైట్‌లో ఫుడ్ ఏరియాలో బొద్ధింకలు కనిపించి షాక్ అయ్యాను. ఇది చాలా దారుణమైన విషయం. ఫ్లైట్స్‌ని చాలా క్లీన్‌గా ఉంచుతారన్న నమ్మకంతో ప్రయాణికులంతా ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదు"

- ప్రయాణికుడు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Embed widget