Pakistan: పీవోకేలో ప్రజల్ని బలివ్వడానికి పాకిస్తాన్ కుట్ర - పౌరులకు మిలటరీ ట్రైనింగ్ - వీడియోలు వైరల్
Pehalgam Attack: పాకిస్తాన్ సైన్యం పీవోకేలో ప్రజలను బలివ్వాలని నిర్ణయించుకుంది. వారికి మిలటరీ ట్రైనింగ్ ఇస్తోంది.

Pakistan Training : పాకిస్తాన్ సైన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. పీవోకేను ఉగ్రవాద కేంద్రంగా మార్చిన ఆ దేశం ఇప్పుడు అక్కడి ప్రజల్ని బలి పశువులుగా చేసేందుకు నిర్ణయించుకుంది. వారికి మిలటరీ ట్రైనింగ్ ఇస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో(PoK)లో స్థానికులకు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిక కశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత్ దాడులు చేయడం ఖాయమని నమ్మడంతో అక్కడి ప్రజలని రెచ్చగొట్టి మీరే సైనికులు అని ఆయుధాల్లో ట్రైనింగ్ ఇస్తోంది.
#PakistanArmy is using its civilian population (locals) as shields, by establishing posts, camps, Artillery & Mortar positions in residential areas of Azad Kashmir (Pakistan occupied Indian territory). https://t.co/Mhtjh78C0u pic.twitter.com/cnEQJx2A9v
— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) April 26, 2025
పీవోకేలో పాకిస్థాన్ సైన్యం శిక్షణా శిబిరాలను విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఆ శిబిరాలలో స్థానికులకు ఆయుద్ధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. భారత్ చేసే దాడులకు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని అందుకని సైన్యాన్ని దూరం పెట్టి.. స్థానిక ప్రజల్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు
పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, ఆ కుట్రలో భాగమైన వారిని వారి ఊహకు అందని విధంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. రక్షణ శాఖ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడికి భారతదేశం స్పందించే విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించే విషయంలో సాయుధ దళాలకు పూర్తి స్వే్చ్ఛ ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. దీంతో ఆర్మీ సరైన సమయం కోసం చూస్తోంది.
#PakistanArmy
— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) May 2, 2025
• War Sirens are being set-up all over Khyber Pakhtunkhwa.
• Civilians are being trained in Gilgit Baltistan (PoJK).
• Emergency war-response drills are being provided to the children in Azad Kashmir (PoJK). https://t.co/9mQ4VjGxIF pic.twitter.com/esa59CgNbs
భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల విషయంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉంది. పాకిస్తాన్ మిలటరీ చేసిన తప్పుడుపని వల్ల ఆ దేశానికి, దేశ ప్రజలకు ఎన్నోసమస్యలు వస్తున్నాయి. చివరికి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలనూ బలి చేస్తున్నారు. మరో వైపు పాకిస్తాన్ ఆర్మీచేస్తున్న యుద్ధ సన్నాహాల్లో వారి చేతకానితనం అంతా వీడియోల్లో వెలుగులోకి వస్తోంది.
WTF: Amid rising India-Pakistan war tensions, the Pakistan Army conducted a military drill. During the exercise, an army vehicle overturned and fell on soldiers. 2 soldiers d!ed and 3 were injured in the incident.#Pakistan#IndiaPakistanWar#PakistanArmy #Kashmir #Pahalgam pic.twitter.com/RFOuvFv07L
— Atul Kushwaha (@RealAtulsay) May 3, 2025





















