అన్వేషించండి

Karachi Bakery : కరాచీ అనే పేరున్నందుకు కష్టాలు - బేకరీ వంద శాతం ఇండియన్ బ్రాండే - ఫ్లెక్సీలు పెట్టుకున్న ఓనర్లు

Hyderabad: కరాచీ బేకరి వంద శాతం ఇండియన్ బ్రాండేనని ఓనర్లు పోస్టర్లు వేసుకున్నారు. కొంత మంది దేశభక్తి పేరుతో కరాచీ బేకరీలను టార్గెట్ చేస్తూండటంతో ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది.

Karachi Bakery Problem : సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు దేశంలో కొంత మంది దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి కొన్ని నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి నిరసనల వల్ల హైదరాబాద్‌‌లో ప్రసిద్ధి చెందిన కరాచీ బేకరి ఇ్బబంది పడుతోంది.  ప్రతి సారి టార్గెట్ అయ్యే బ్రాండ్ కరాచీ బేకరి. కరాచీ పాకిస్తాన్ లో ఉన్న పట్టణం పేరు. కానీ ఆ కరాచీకి చెందిన వారు లేదా పాకిస్తాన్ వాసులు ఎవరూ   ఆ బ్రాండ్ తో ఇక్కడ వ్యాపారం చేయడం లేదు. కరాచీ బేకరి యజమానులు  అచ్చమైన భారతీయులు. దేశ విభజన సమయంలో ఇండియానే తమ దేశం అని అన్నీ వదులుకుని వచ్చేశారు. పైగా హిందువులు. 

దేశ విభజనకు ముందు భారత్ లో కరాచీ కూడా దేశంలో ఓ భాగం.  దేశ ప్రముఖ నగరాల్లో ఒకటి. అక్కడ ప్రత్యేకత..బేకరీ. ఒక్కో సిటీకి ఒక్కో గుర్తింపు ఉన్నట్లుగా కరాచీ బిస్కెట్లకు ప్రిసిద్ధి. దేశవిభజన తర్వాత ఇక్కడకు వచ్చేసిన వారు కరాచీ బేకరీ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. దాన్ని విస్తరించుకున్నారు. గుండెల నిండుగా దేశభక్తి ఉన్న వారికి పాకిస్తాన్ కరాచీకి సంబంధమే లేదు. 1953 నుంచి వారు వ్యాపారం చేస్తున్నారు.ఎప్పుడూ వారికి పేరు సమస్య లేదు. కానీ కొత కొన్నేళ్లుగా మాత్రం వారికి సమస్యలువస్తున్నాయి. 

హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ  1953లో ఖాన్‌చంద్ రామ్‌నాని  అనే సింధీ వ్యాపారి  ప్రారంభించారు.   అతను 1947లో భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో కరాచీ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చాjg.  ఈ బేకరీని అతను తన పుట్టిన ఊరైన కరాచీ నగరం పేరుతో ప్రారంభించాడు. ప్రస్తుతం, కరాచీ బేకరీని రామ్‌నాని కుటుంబం యొక్క మూడవ తరం నిర్వహిస్తోంది. కరాచీ బేకరీ 1953లో హైదరాబాద్‌లోని మొజాంజహీ మార్కెట్‌లో మొదటి స్టోర్‌తో ప్రారంభమైంది. ఖాన్‌చంద్ రామ్‌నాని తన నలుగురు  కుమారులతో కలిసి ఈ వ్యాపారాన్ని నడిపాడు, మొదట్లో టోకు వ్యాపారులకు బేకరీ ఉత్పత్తులను విక్రయించాడు. 1960లలో  ఫ్రూట్ బిస్కెట్లు , ఒస్మానియా బిస్కెట్ల తయారీ  ప్రారంభించారు. కరాచీ  బేకరీ కి హైదరాబాద్‌లో 25 స్టోర్‌లు ఉన్నాయి.   ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకూ విస్తరించింది. ఇది యుఎస్‌ఎ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా,  గల్ఫ్ దేశాలతో సహా 20 కంటే ఎక్కువ దేశాలకు బిస్కెట్లు ఎగుమతి చేస్తుంది.    

 

కరాచీ బేకరీ పేరు కారణంగా  పాకిస్తాన్‌ కు చెందినదిగా భావిస్తూంటారు.  2019లో, బెంగళూరులోని ఒక శాఖపై దాడి జరిగింది, దీనిలో "కరాచీ" పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. 2021లో ముంబైలో శివసేన నాయకుడు పేరు మార్చమని ఒత్తిడి చేశారు. అయినా బ్రాండ్, భావోద్వేగం కారణంగా యజమానులు పేరు మార్చుకునేందుకు ఆసక్తి చూపించలేదు.  కరాచీ బేకరీ పూర్తిగా భారతీయ బ్రాండ్ అని దుకాణాల ముందు పోస్టర్లు పెట్టుకున్నారు. తమ  వ్యాపార సంస్థపై జరుగుతున్న ప్రచారం, ప్రతీ సారి టార్గెట్ అవుతున్న వైనంతో వారు మనస్తాపానికి గురయ్యారు. దుకాణాల ముందు తాము వంద శాతం ఇండియన్లం అని.. పరోక్షంగా హిందువులం అని చెప్పుకోవాల్సి వస్తోంది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Income Tax: ఆదాయపు పన్నును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చా? లాభమా, నష్టమా
ఆదాయపు పన్నును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చా? లాభమా, నష్టమా

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget