MEA Press Conference: పాక్ దాడులను తిప్పికొట్టాం - ఐక్యరాజ్య సమితికి ఆధారాలు - MEA కీలక ప్రకటన
MEA Press Conference: పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టామని కానీ తామే దాడులు చేస్తున్నట్లుగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. దాడులకు ప్రయత్నిస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది.

Operation Sindoor india air strike : పాకిస్తాన్ పౌరులను భారత్ టార్గెట్ గా చేసుకోలేదని భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రి ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నర్ సోఫియా ఖురేషితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు, ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.. ఆ ప్రయత్నాలను రక్షణ దళాలు తిప్పికొట్టాయని వింగ్ కమాండ్ వ్యోమికా సంగ్ తెలిపారు.
LOC వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో 16 మంది అమాయకులు మరణించారన్నారు. భారతదేశం తీవ్రవాదాన్ని ఆపడానికి కట్టుబడి ఉందని ... దానికి పాకిస్తాన్ అంగీకరించాల్సి లఉందన్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ భారీ ఫిరంగులను ఉపయోగించి LOC పై కాల్పులను తీవ్రతరం చేసిందని కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు. అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కల్నల్ సోఫియా ఆరోపించారు. ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ సైన్యమే పోషిస్తోందన్నారు. లాడెన్ ఎక్కడున్నాడని.. మసూద్ అజర్ ఎక్కుడున్నారని కల్నర్ సోఫియా ప్రశ్నించారు. పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో ప్రపంచం అంతా తెలుసన్నారు.
#WATCH | #MEA Special Media Briefing on #OperationSindoor:
— All India Radio News (@airnewsalerts) May 8, 2025
Colonel Sofiya Qureshi says, "This morning, the #IndianArmedForces targeted Air Defence Radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as… pic.twitter.com/KMhFcCeSzv
పాకిస్తాన్ తప్పుడు సమాచరాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. పహల్గాం దాడితో మొదటగా ఉద్రిక్తతలు పెంచింది పాకిస్తానేనని ఫారిన్ సెక్రటరి విక్రమ్ మిస్త్రి ప్రకటించారు. పాకిస్తాన్ చేసిన దాడికి సంబందించిన ఆధారాలు ఉన్నాయన్నారు. వాటి డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు సేకరించామని ఆధారాలుగా.. ఐక్యరాజ్య సమితికి అందిస్తామన్నారు.
VIDEO | MEA Press Briefing on Operation Sindoor: Foreign Secretary Vikram Misri (@VikramMisri) says, "First of all, there is mention on all sides of escalation. I think the first point that you have to keep in mind is that the attack in Pahalgam on April 22 was the original… pic.twitter.com/Ad9IXXiSqH
— Press Trust of India (@PTI_News) May 8, 2025
చనిపోయిన ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారని విక్రమ్ మిస్త్రి ఫోటోలు చూపించారు. ప్రార్థనా స్థలాలను ఉగ్రవాద కేంద్రాలుగా మార్చారని.. మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులపై దాడి చేశాం తప్ప . ఎలాంటి ప్రాజెక్టులు,మౌలిక సదుపాయాలపై దాడులు చేయలేదని స్పష్టం చేశారు. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేశామని స్పష్టం చేశారు..
“Giving state funerals to terrorists may be a regular practice in Pakistan”: MEA pic.twitter.com/uxudH1VPWR
— Amiet R. Kashyap (@Amitraaz) May 8, 2025
ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నారని విక్రమ్ మిస్త్రి గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ లో సిక్కులను పాక్ టార్గెట్ చేసిందన్నారు. మూడు గురుద్వారాలపై దాడి చేసిందన్నారు.పాకిస్తాన్ లోని సరిహద్దు దాడుల్లో పదహారు మంది పౌరులు చనిపోయారుని ఫోటోలను చూపించారు విక్రమ్. పహల్గాం దాడి ఘటనలపై అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ మొగ్గుచూపుతోందన్నారు. ఆధారాలు ఇవ్వాలని అడుగుతోందని గతంలో ఎన్నో దాడులపై ఆధారాలు ఇచ్చినా ఇంత వరకూ దర్యాప్తు పూర్తి చేయలేదని విక్రమ్ గుర్తు చేశారు.
"Fabrication"
— Sidhant Sibal (@sidhant) May 8, 2025
Foreign Secretary Vikram Misri on Pakistani claims that India attacked Dam projects. pic.twitter.com/qOMbn0weeD





















