X

Omicron: దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు... కొత్తగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్ లో 9 కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా మరో 16 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.

FOLLOW US: 

దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి మహారాష్ట్ర వచ్చిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వైరస్‌ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఈ వేరియంట్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది. 

Also Read: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'

సాధారణ జలుబు లక్షణాలు

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కు చేరాయి. అయితే ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వచ్చిన వారి లక్షణాలు భిన్నంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా వైద్యులు ఇప్పటికే తెలిపారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తేలింది. దిల్లీలో ఒమిక్రాన్ తొలికేసు నమోదైంది. టాంజానియా నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తికి ఆదివారం ఒమిక్రాన్ నిర్ధరణైంది. అతనికి గొంతు నొప్పి, నీరసం సహా ఒళ్లునొప్పులు ఉన్నట్లు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి వైద్యులు డా.సురేశ్ కుమార్ తెలిపారు. ఆ ఆసుపత్రిలో కొవిడ్ పాజిటివ్ వచ్చి చేరిన మిగిలి అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డెల్టా సహా సార్క్ కోవ్-2 ఇతర వేరియంట్లు సోకిన వారిలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు వచ్చాయి. అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో మాత్రం ఇతర వేరియంట్లలా కాకుండా సాధారణ లక్షణాలైన జలుబు వంటివే ఉన్నాయి. కానీ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

Also Read: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు

భిన్నమైన లక్షణాలు..

ఒమిక్రాన్ అసాధారణ లక్షణాలను తొలుత సౌతాఫ్రికా వైద్యుడు ఏంజెలిక్ కోజీ గుర్తించారు. సౌతాఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఏంజెలిక్ యే ఈ వేరియంట్‌ను గుర్తించి తొలుత సౌతాఫ్రికా ప్రభుత్వానికి తెలిపారు. ఎక్కువ మ్యూటేషన్లు ఉండటమే ఈ వైరస్ వ్యాప్తి కూడా కారణమని ఆయన అన్నారు.  కర్ణాటకలో నమోదైన ఒమిక్రాన్ తొలి రెండు కేసులు, మూడో కేసు అయిన ముంబయి మెరైన్ ఇంజనీర్, గుజరాత్ ఎన్‌ఆర్‌ఐ సహా ఇలా వీరందరికీ చాలా స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఒమిక్రాన్ సోకిన వారికి తీవ్రమైన లక్షణాలు ఏం లేవని, కేవలం స్వల్పంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ వేరియంట్‌కు వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. అయితే దీని వల్ల ఎవరికైనా జలుబుగా ఉన్న సాధారణమైనదని అనుకుని లైట్ తీసుకునే ప్రభావం ఉందని పేర్కొన్నారు. 

Also Read: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: India corona updates Omicron India omicron updates

సంబంధిత కథనాలు

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Samantha Naga Chaitanya Divorce: ఆమే అడిగింది.. సమంత-చైతూ విడాకులపై నాగార్జున షాకింగ్ కామెంట్స్

Samantha Naga Chaitanya Divorce: ఆమే అడిగింది.. సమంత-చైతూ విడాకులపై నాగార్జున షాకింగ్ కామెంట్స్

AP Revenue Divisions: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదన... అవేంటంటే...!

AP Revenue Divisions: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదన... అవేంటంటే...!

Chandrababu: గుడివాడ కేసినోపై సమగ్ర విచారణ జరిపించాలి.. గవర్నర్ కు చంద్రబాబు లేఖ

Chandrababu: గుడివాడ కేసినోపై సమగ్ర విచారణ జరిపించాలి.. గవర్నర్ కు చంద్రబాబు లేఖ

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

Telangana Govt Vs Governer :  ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం..  బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?