OLA Offers: హోళీకి అదిరిపోయే ఆఫర్లు ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్, ఆ బైక్‌పై రూ.16 వేల డిస్కౌంట్
OLA Offers: హోళి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.
OLA Electric Offers:
ఓలా ఎలక్ట్రిక్ డిస్కౌంట్‌లు..
విద్యుత్ వాహనాలకు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తోంది. కరోనా తరవాత ఈవీ రంగంలో స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. బ్యాటరీలు తయారు చేసే కంపెనీలూ పెరుగుతున్నాయి. అయితే...వీటిలో Ola Electric బ్రాండ్ జనాల్లో చొచ్చుకుపోయింది. ఆఫర్లతో కస్టమర్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ హోళీ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్‌లు పెట్టింది. S1 Pro టూ వీలర్‌పై ఇప్పటికే రూ.12 వేల డిస్కౌంట్ ప్రకటించిన సంస్థ...ఇప్పుడు మరో రూ.4 వేల తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పాత ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే...4 వేల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. Ola S1 Pro ఎక్స్‌షో రూం ధర రూ.1.27 లక్షలుగా ఉంది. ఈ ఆఫర్లతో పాటు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అన్ని S1 వెహికిల్స్‌పైనా రూ.2 వేల తగ్గింపునిస్తోంది. 3KWH కన్నా ఎక్కువ కెపాసిటీ బ్యాటరీలున్న వాహనాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. Ola S1 ప్రారంభ ధర రూ.1.08 లక్షలు. Ola S1లో 2 KWH కన్నా తక్కువ కెపాసిటీ బ్యాటరీలున్న వెహికిల్స్‌లో ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను రూ.2 వేలుగా నిర్ణయించింది. వీటితో పాటు Ola Experience Centres దాదాపు రూ.7 వేల వరకూ బెనిఫిట్స్ ఇస్తోంది. వారంటీలు ఎక్స్‌టెండ్ చేయడం, Ola Care+ సబ్‌స్క్రిప్షన్స్‌పై 50% ఫ్లాట్ డిస్కౌంట్ లాంటి ఆఫర్లనూ అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న వారికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది కంపెనీ. Ola Care Planలో సర్వీస్‌ను ఫ్రీగా ఇవ్వనుంది.
బండి చోరీకి గురైతే...హెల్ప్‌లైన్‌కు కాల్ చేసే వీలుంటుంది. రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌నూ ఆఫర్ చేస్తోంది. Ola Care+ సబ్‌స్క్రైబ్ చేసుకునే వారికి ఫ్రీ హోమ్ సర్వీస్ అందించనుంది. 24/7 డాక్టర్ అసిస్టెన్స్, ఆంబులెన్స్ సర్వీస్‌లు అందిస్తుంది. Ola's S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. 2.47 kWh బ్యాటరీ ఉన్న వెహికిల్స్‌కు ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
యూపీలో ఆఫర్లు..
పలు రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందంజలో ఉంది. సాధారణంగా వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అయితే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి వీటి నుంచి మినహాయింపునిచ్చింది యూపీ ప్రభుత్వం. రోడ్ ట్యాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజ్‌లనూ రద్దు చేసింది. మూడేళ్ల పాటు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఇటీవలే యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. Electric Vehicle Manufacturing and Mobility Policy- 2022ని గతేడాది అక్టోబర్‌లోనే తయారు చేసింది ప్రభుత్వం. అయితే...దాదాపు 5 నెలల తరవాత ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ రాయితీ ఇస్తోంది. మొత్తం రాయితీలతో కలుపుకుంటే టూ వీలర్స్‌పైన రూ.15-20 వేల వరకూ తగ్గింపు ఉంటుంది. అదే కార్లలో అయితే రూ.లక్ష వరకూ సబ్సిడీ వస్తుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి 100% రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి రిజిస్టర్ అయిన వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది.