Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Odisha Train Accident: ప్రమాదాలపై గతంలోనే కాగ్ రిపోర్ట్ ఇచ్చినా మోదీ సర్కార్ పట్టించుకోలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు.
Odisha Train Accident:
ట్విటర్‌లో విమర్శలు..
రైలు ప్రమాదాలపై ఆర్నెల్ల క్రితమే కాగ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. పట్టాలు తప్పడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్‌లు జరుగుతున్నట్టు తేల్చి చెప్పింది. ఒడిశా రైలు ప్రమాదంతో ఈ రిపోర్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే..దీనిపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఆర్నెల్ల ముందే కాగ్ రిపోర్ట్ ఇచ్చినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. ఇది కేవలం మోదీ సర్కార్ నిర్లక్ష్యమేనని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇదే విషయమై ట్విటర్‌లో విమర్శలు చేసింది. ప్రమాదం జరిగి 24 గంటలు దాటిపోయిందని...ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ ఇచ్చినా ఎందుకు అప్రమత్తం కాలేదని మండి పడ్డారు.
"ఈ ఘోరమైన ప్రమాదం జరిగి 24 గంటలు దాటిపోయింది. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఉన్నతాధికారులకు ఏ మాత్రం బాధ్యత లేదా..? నిపుణులు, పార్లమెంటరీ కమిటీ, కాగ్ ఇచ్చిన రిపోర్ట్‌లు, సలహాలను ఎందుకు పట్టించుకోలేదు? కీలకమైన ప్రాంతాలకు సరైన నిధులు కేటాయించలేదు. ఖాళీగా ఉన్న పోస్ట్‌లనూ భర్తీ చేయలేదు. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? లాల్‌బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్, మాధవ్ రావ్ సింధియాలా నైతిక బాధ్యత తీసుకుని రైల్వే మంత్రి ఎందుకు రాజీనామా చేయకూడదు"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
बालासोर, उड़ीसा में भयावह ट्रेन दुर्घटना को हुए 24 घंटे से अधिक बीत चुके हैं
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2023
क्या मानवीय व नैतिक आधार पर शीर्ष पदों पर बैठे लोगों की जवाबदेही नहीं तय की जानी चाहिए?
विशेषज्ञों, संसदीय समिति, CAG रिपोर्ट की चेतावनियों व सुझावों को नजरंदाज करने के लिए कौन जिम्मेदार है?
रेलवे में…
కాగ్ రిపోర్ట్..
2017 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో 16 రైల్వే జోన్లలో దాదాపు 1129 పట్టాలు తప్పిన ఘటనలు జరిగాయని గతేడాది డిసెంబర్లో వెలువరించిన ఈ నివేదికలో వెల్లడించింది. అంటే నాలుగేళ్లలో ఏడాదికి 282 డీరైల్‌మెంట్ (derailments) ఘటనలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల కారణంగా రైల్వేకి రూ.32 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. వీటితో పాటు మరి కొన్ని వివరాలూ వెల్లడించింది ఈ నివేదిక. పట్టాలు తప్పడానికి గల 24 కారణాలను ఈ నివేదికలో వెల్లడించింది CAG.ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల 422 ప్రమాదాలు జరిగినట్టు తేల్చి చెప్పింది. ఇక 171 కేసులలో ట్రాక్ మెయింటెనెన్స్ లేకపోవడం ప్రమాదాలకు దారి తీసింది. ప్రమాణాలకు అనుగుణంగా పట్టాలు తయారు చేయకపోవడం వల్ల 156 ప్రమాదాలు జరిగాయి. మెకానికల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఘోర విషాదాలు చూడాల్సి వచ్చింది. దాదాపు 182 సంఘటనలు జరిగాయి. కోచ్‌లలో లోపాలతో పాటు రైల్ చక్రాల డయామీటర్ ప్రమాణాలకు తగిన విధంగా లేకపోవడమూ ప్రాణనష్టానికి దారి తీసింది.
Also Read: Odisha Train Accident: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో రైలు ప్రమాదాల్ని నియంత్రించొచ్చా? అదెలా సాధ్యం?