అన్వేషించండి

Girl Child: తెలంగాణ‌లో త‌గ్గిపోయిన బాలిక‌ల సంఖ్య‌, మ‌రి ఏపీ ప‌రిస్థితి ఏంటి?

తెలంగాణ‌లో బాలిక‌ల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. 33 జిల్లాలలో నిర్వ‌హించిన స‌ర్వేలో బాలిక‌ల రేటు ప‌డిపోయిన‌ట్టు ప్ర‌భుత్వంవెల్ల‌డించింది. ఏపీ విష‌యానికి వ‌స్తే బాలికల జ‌న‌నాలు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Girl child number decreased: దేశ‌వ్యాప్తం(Country wide)గా చిన్నారుల(children) సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం 141 కోట్ల‌కుపైగా జ‌నాభా(People) ఉన్న దేశంలో జ‌న‌నాలు(Birth) కూడా పెరుగుతు న్నాయి. అయితే.. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క‌క్క విధంగా ఈ జ‌న‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ద‌క్షిణాది(Southern states) రాష్ట్రాల‌లో మ‌గ శిశువుల జ‌న‌నాలు పెరుగుతుండ‌డం, ఆడ శిశువుల(Female infant) జ‌న‌నాలు త‌గ్గుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఆడ‌పిల్ల పుడితే.. ఇంట్లో మ‌హాల‌క్ష్మి పుట్టిన‌ట్టేన‌ని భావించే రోజులు ఒక‌ప్పుడు ఉండేవి.

ఓ ద‌శాబ్దం కింద‌ట కేవ‌లం మ‌గ శిశువుల కోస‌మే అన్న‌ట్టుగా కుటుంబాలు వ్య‌వ‌హ‌రించాయి. దీంతో ఆడ శిశువుల జ‌న‌నాల రేటు అమాంతం ప‌డిపోయింది. త‌ర్వాత‌.. వ‌చ్చిన ప్ర‌భుత్వాలు.. ఆడ శిశువుల జ‌ననాల రేటును పెంచేందుకు కృషి చేశాయి. అదేవిధంగా త‌ల్లి గ‌ర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధార‌ణ‌పైనా క‌ఠిన నిర్ణ‌యం తీసుకుని నిలువరించే ప్ర‌య‌త్నాలు చేసింది. దీంతో గత ద‌శాబ్దం నుంచి మ‌ళ్లీ ఆడ శిశువుల జ‌న‌నాల రేటు దేశంలో పెరుగుతూ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ట్రెండ్ మారింది. తాజాగా తెలంగాణ‌లో నిర్వ‌హించిన స‌ర్వేలో ఆడ శిశువుల జ‌న‌నాలు త‌గ్గిపోతున్నాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే తేల్చి చెప్పింది. 

తెలంగాణ‌(Telangana)లో లింగ నిష్పత్తి(Sex ratio) వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతోందని ప్ర‌భుత్వం పేర్కొంది. మొత్తం 33 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో 7 జిల్లాలు మిన‌హా.. మిగిలిన 26 జిల్లాల్లో బాలిక‌ల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ `ఈ- బర్త్‌ పోర్టల్‌`(E-Birth portal) గణాంకాల ప్రకారం జనవరిలో జన్మించిన వారిలో 52% మగపిల్లలే ఉన్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 9,986 జననాలు రికార్డయ్యాయి. ఇందులో 5,181 మంది అబ్బాయిలు కాగా, 4,805 మంది అమ్మాయిలు. ఇంతటి వ్యత్యాసం ప్రమాదకరమని వైద్యులు, వైద్య రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మగపిల్లల సంఖ్య పెరుగుతుండగా, ఆడ పిల్లల సంఖ్య తగ్గుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యిమంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం బాలల లింగ నిష్పత్తి(చైల్డ్‌ సెక్స్‌ రేషియో) 1000:932గా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధానంగా  లింగ నిర్ధారణ పరీక్షలు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆ ఏడు జిల్లాల్లో... 
తెలంగాణ‌లోని 7 జిల్లాల్లో ఆడ శిశువుల‌(Female infant) జననాల రేటు ఎక్కువగా ఉందని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. జయశంకర్‌ భూపాలపల్లి (62%), నిర్మల్‌ (54.28%), వికారాబాద్‌ (53%), కొమరంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం(52%), జగిత్యాల(51%), రాజన్న సిరిసిల్ల (51.55%) వీటన్నిటిలోనూ ఆడపిల్లల జననాలు 50 శాతానికిపైగా ఉండడం విశేషం. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఆయా జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులు తక్కువగా ఉండడమే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇవి మిన‌హా మిగతా 26 జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉండడంతో పాటు, లింగ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా చేస్తున్నారనే సందేహాలు వ‌స్తున్నాయి. ముందుగానే  త‌ల్లిదండ్రులు త‌మ‌కు పుట్టబోయే శిశువు ఎవ‌ర‌నేది తెలుసుకుని.. ఆడపిల్ల అని తెలిస్తే గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారని వైద్యులు, ప్ర‌భుత్వం కూడా అనుమానిస్తోంది. 

గ్రామీణ ప్రాంతాల్లో బాగానే ఉంది..

తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడ శిశువుల జ‌న‌నాల ప‌రిస్థితి బాగానే ఉంద‌ని ప్ర‌భుత్వం వెలువ‌రించిన నివేదిక స్ప‌ష్టం చేసింఇ. ప్రతి 1000 మంది పురుషులకు 999 మంది స్త్రీలుండగా, పట్టణ ప్రాంతాల్లో 970 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ `ఈ-బర్త్‌ పోర్టల్‌` జనవరి గణాంకాల మేరకు 78% జిల్లాల్లో మ‌గ శిశువులే ఎక్కువగా జన్మించారు. ఇందులో ములుగు మినహా 32 జిల్లాల గణాంకాలను అప్‌లోడ్‌ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లాల్లో మ‌గ శిశువుల జ‌న‌నాల‌ రేటు ఎక్కువగా ఉంది. అక్కడ 69% మంది మగ పిల్లలు పుట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా(60%) ఆ తర్వాత స్థానంలో ఉంది. నల్లగొండ (56%), సూర్యాపేట (55%), ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ (54%), ఖమ్మం, మంచిర్యాల (53%) జిల్లాల్లోనూ మ‌గ శిశువుల‌ జననాలు సగంపైగా ఉన్నాయి. కాగా, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో మగపిల్లల కంటే ఆడ పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సామాజిక స‌మ‌తుల్యంపై దెబ్బ‌!

స‌మాజం(Society)లో ఆడ శిశువుల జ‌న‌నాల రేటు త‌గ్గిపోతుండ‌డంతో కొన్ని సామాజిక వర్గాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని.. ప్రస్తుత `చైల్డ్‌ సెక్స్‌రేషియో` వ్యత్యాసం ఇలాగే కొనసాగితే 20 ఏళ్ల తర్వాత యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టమేనని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపై కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఏపీలో ప‌రిస్థితి ఇదీ.. 

ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhrapradesh)లో ప‌రిస్థితి గ‌త ఐదేళ్ల‌లో ఆశాజ‌న‌కంగానే ఉంద‌ని ప్ర‌భుత్వం గ‌త ఏడాది వెలువ‌రించిన నివేదిక స్ప‌ష్టం చేసింది. ఆడ‌, మ‌గ శిశువుల జ‌న‌నాల వ్య‌త్యాసం రాష్ట్రంలో పెద్ద‌గా లేద‌ని పేర్కొంది. ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో కూడా ఆడ శిశువుల జ‌న‌నాలు గ‌త 10 ఏళ్ల కాలంతో పోల్చుకుంటే బాగానే ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ముఖ్యంగా గ‌త ఐదేళ్లుగా అమ‌లు చేస్తున్న ప‌లు కీల‌క సంక్షేమ ప‌థ‌కాలు.. ఆడ శిశువుల  జ‌న‌నాల‌ను ప్రోత్స‌హిస్తున్నాయ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కాల కార‌ణంగా గ్రామీణ ప్రాంతాల్లో జ‌న‌నాల రేటు పెరిగింద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 

కేంద్రం తోడ్పాటు.. 

దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే.. ఆడ శిశువుల జ‌న‌నాల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(PM Modi) ``బేటీ బ‌చావో-బేటీ ప‌డావో``(Beti bachao-Beti padao) కార్య‌క్ర‌మం ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌భావం చూపిస్తోంది. ఈ ప‌థ‌కం కింద‌.. నెల నెలా రూ.500 నుంచి ఏడాది 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే.. ఆడ పిల్ల‌ల‌కు అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. దీనివ‌ల్ల ఉత్త‌రాదిలో ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, ఒడిశా, వంటి రాష్ట్రాల్లో ఆడ శిశువుల జ‌న‌నాలు పెరుగుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Vettaiyan Movie Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Vettaiyan Movie Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
IRCTC : ట్రైన్‌లో ఫుడ్ నచ్చట్లేదా జోమాటోలో ఆర్డర్ ఇచ్చేయండి - అందుబాటులోకి కొత్త సర్వీస్
ట్రైన్‌లో ఫుడ్ నచ్చట్లేదా జోమాటోలో ఆర్డర్ ఇచ్చేయండి - అందుబాటులోకి కొత్త సర్వీస్
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Embed widget