అన్వేషించండి

Hyderabad News: జనవరి 1 నుంచి 'నుమాయిష్' - సందర్శకులకు కీలక సూచనలు

Numaish Event: జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ - 2024 సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సందర్శకులు మాస్క్ ధరించాలని సూచించారు.

Numaish Event Started From January 1st: హైదరాబాద్ (Hyderabad) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో జనవరి 1 నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్ - 2024) ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి, నుమాయిష్ ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా 83వ నుమాయిష్ ప్రారంభిస్తామని చెప్పారు. 8 ఏళ్లుగా 'నుమాయిష్' తెలంగాణకు ఓ ప్రైడ్ అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది ప్రజలు సందర్శిస్తారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. 'నుమాయిష్'కు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి 2,400 పైచిలుకు ఎగ్జిబిటర్లు రానున్నారని, తొలిసారిగా శాఖాహారం రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నుమాయిష్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 1న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 15 వరకూ కొనసాగనుంది.

స్టాల్స్ విషయంలో జాగ్రత్తలు

ఎగ్జిబిషన్ లో స్టాల్స్ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుంటుందని, ఫైర్, హెల్త్, అంబులెన్స్ విషయంలో చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎంతో మంది ఇక్కడికే వచ్చి వ్యాపారం చేస్తున్నారని, వారికి సొసైటీ ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యా సంస్థలు నడుస్తున్నాయని, 30 వేల మంది మహిళలకు విద్య అందుతుందన్నారు. సందర్శకులకు సౌలభ్యం కలిగేలా మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

టికెట్ ధర ఎంతంటే.?

ఎగ్జిబిషన్ ను సందర్శించే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వారిని గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40గా నిర్ధారించారు. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆహ్లాదకర వాతావరణంలో అందరూ మెచ్చేలా 'నుమాయిష్' సాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఏనుగుల రాజేందర్ కుమార్ తెలిపారు. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ చెప్పారు.

ఒకేచోట అన్నీ

'నుమాయిష్' ఎగ్జిబిషన్ లో అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, మంచాలు, కిచెన్ సామాగ్రి, వివిధ రకాల దుప్పట్లు, కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త తరహా ఫర్నీచర్స్, మల్టీ పర్పస్ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అన్నీ ఎగ్జిబిషన్ లో కొలువుదీరనున్నాయి.

ఇదీ చరిత్ర

1938వ సంవత్సరంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అప్పట్లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించేవారు. ఆ తర్వాత 1946లో నాంపల్లిలోనూ ఎగ్జిబిషన్ మైదానంలోని 26 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న 'నుమాయిష్' కార్యక్రమం దేశ, విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడం సహా, వాటి విక్రయాలకు సైతం ఈ ఈవెంట్ కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు.

Also Read: Telangana News: 'విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచారు' - రూ.59 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
Sunrisers Hyderabad vs Gujarat Titans: ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ వర్సెస్ గుజరాత్, ఆధిపత్యం చెలాయించింది ఎవరు, రికార్డులు ఇవీ
ఉప్పల్‌ స్డేడియంలో సన్‌రైజర్స్‌ వర్సెస్ గుజరాత్, ఆధిపత్యం చెలాయించింది ఎవరు, రికార్డులు ఇవీ
Andhra Pradesh News: ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
Peddi Vs Paradise: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP DesamJofra Archer Bowling vs PBKS IPL 2025 | నిద్ర పవర్ ఏంటో చాటి చెప్పిన జోఫ్రా ఆర్చర్ | ABP DesamMS Dhoni Parents at Chennai CSK Match | ధోని చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
Sunrisers Hyderabad vs Gujarat Titans: ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ వర్సెస్ గుజరాత్, ఆధిపత్యం చెలాయించింది ఎవరు, రికార్డులు ఇవీ
ఉప్పల్‌ స్డేడియంలో సన్‌రైజర్స్‌ వర్సెస్ గుజరాత్, ఆధిపత్యం చెలాయించింది ఎవరు, రికార్డులు ఇవీ
Andhra Pradesh News: ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
ముంబై ఎయిర్ పోర్టులో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
Peddi Vs Paradise: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..
Ayodhya Surya Tilak: అయోధ్యలో అద్భుత దృశ్యం, రామనవమి నాడు బాలరాముడికి సూర్యతిలకం- వీడియో చూశారా
అయోధ్యలో అద్భుత దృశ్యం, రామనవమి నాడు బాలరాముడికి సూర్యతిలకం- వీడియో చూశారా
Akhil Akkineni: అఖిల్‌కు పెళ్లి కళ వచ్చేసిందిగా.. కాబోయే భార్యతో లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే?
అఖిల్‌కు పెళ్లి కళ వచ్చేసిందిగా.. కాబోయే భార్యతో లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే?
Bhadrachalam Sri Rama Kalyanam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
Anasuya Bharadwaj: అనసూయ సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతోంది? బీజేపీ పెద్దల సపోర్ట్ ఉన్నా కష్టాలు ఎందుకు?
అనసూయ సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతోంది? బీజేపీ పెద్దల సపోర్ట్ ఉన్నా కష్టాలు ఎందుకు?
Embed widget