Bengaluru: సీరియల్ కిల్లర్లూ జల్సాగా గడిపేస్తున్నారు - బెంగళూరు జైలు వీడియోలు వైరల్
Bengaluru Central Jail: బెంగళూరు జైలులో ఖైదీలకు రాయల్ ట్రీట్‌మెంట్ల భిస్తోంది. ఉమేష్ రెడ్డి అనే కరుడుగట్టిన నేరస్తుడు జైలు నుంచే నేరసామ్రాజ్యాన్ని నడుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Criminals Using Mobile Phones Inside Bengaluru Central Jail: బెంగళూరులోని పరప్పన అగ్రహారా సెంట్రల్ జైలులో ఉగ్రవాద నిందితులు, స్మగ్లర్లు, రేపిస్టులు'రాయల్ ట్రీట్‌మెంట్' పొందుతున్నారనే షాకింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. హై-సెక్యూరిటీ జైలులోనూ నిందితులు మొబైల్‌లు వాడుతున్నారు. టీవీలు చూస్తూ సొంతంగా వంటలు చేసుకుంటున్న దృశ్యాలు బయటపడ్డాయి. సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, జైలు అధికారులు ఖైదీలకు ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపణలువస్తున్నాయి.
ఈ వివాదం ముఖ్యంగా సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. 18 మంది మహిళలను హత్య చేసి, 9 కేసుల్లో డెత్ సెంటెన్స్ పొందిన ఈ నిందితుడు, జైలులో కఠిన పర్యవేక్షణలో ఉండాల్సి ఉన్నా, మొబైల్‌లు ఉపయోగిస్తూ, టీవీ చూస్తూ, సొంతంగా వంట చేసుకుంటున్న దృశ్యాలు బయటపడ్డాయి. వీడియోల్లో ఉమేష్ రెడ్డి రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్‌తో చాట్ చేస్తున్నాడు. మరో క్లిప్‌లో అతను ఐటెమ్ సాంగ్ చూస్తూ, సౌకర్యవంతంగా మాట్లాడుకుంటున్నాడు. ఇది కేవలం నియమ ఉల్లంఘన కాదు, న్యాయ వ్యవస్థ ను అవమానించడం అనే విమర్శలు వస్తున్నాయి.
Terror suspects, smugglers, and rapists getting royal treatment in Bengaluru jail..... What kind of justice system is this?
— Karnataka Portfolio (@karnatakaportf) November 8, 2025
Once again, shocking visuals have emerged from Parappana Agrahara Central Jail in Bengaluru, raising serious questions about the state of our prison… pic.twitter.com/5D4PfA73Gz
ఈ జైలులో ఉమేష్ రెడ్డి మాత్రమే కాదు, టెర్రరిస్టుల కార్యకలాపాల్లో అరెస్ట్ అయినవారు , గోల్డ్ స్మగ్లింగ్ నిందితులు, సీరియల్ కిల్లర్లు కూడా మొబైల్‌లు, టీవీలు ఉపయోగిస్తున్నారని వీడియోలు చూపిస్తున్నాయి. సుప్రీం కోర్టు 2021లో 'శిక్షలు పడిన వారికి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వకూడదు' అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, ఈ జైలులో అవి చెల్లడం లేదు.
Undated videos have surfaced showing jail inmates using mobile phones and watching TV inside #Bengaluru’s #ParappanaAgrahara Central Jail. pic.twitter.com/pFZK4rMR6l
— Hate Detector 🔍 (@HateDetectors) November 8, 2025
ఈ ఘటనలు జైలు పరిపాలన, సెక్యూరిటీ లాప్స్‌పై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. హై-సెక్యూరిటీ జైలులో మొబైల్‌లు ఎలా? జైలు అధికారులు ఎలా అనుమతిస్తున్నారు? టాక్స్ పేయర్స్ డబ్బుతో నడిచే జైలులో ఇది 'లగ్జరీ రిట్రీట్'గా మారిందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పరప్పన అగ్రహారా జైలు ముందు కూడా ఇలాంటి స్కాండల్స్ జరిగాయి. కన్నడ హీరో దర్శన్ తో పాటు శశికళ విషయంలోనూ ఇవే ఆరోపణలు వచ్చాయి.
Months after the #ParappanaAgrahara central prison came under the spotlight after actor #Darshan was filmed enjoying a luxurious lifestyle, it has now been revealed that several notorious criminals are also getting VIP treatment inside jail. https://t.co/0zw4Otc2Zb pic.twitter.com/WoVTPBW3cH
— Hate Detector 🔍 (@HateDetectors) November 8, 2025
హోమ్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వం ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ‘ఎంత మంది VIP ప్రిజనర్స్ ఇలా సౌకర్యాలు పొందుతున్నారు? న్యాయం ఎప్పుడు మేలుకుంటుంది?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.





















