North Korea Ban Laughing: వార్నీ నీ తస్సారావులో బొడ్డు.. నవ్వొద్దా.. ఏడవొద్దా..! వీడెవడండీ బాబు..!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఆ దేశ ప్రజలకు సరికొత్త ఆంక్షలు విధించారు. ప్రజలెవరూ 11 రోజుల పాటు నవ్వకూడదు, ఏడవ కూడదని ఆదేశాలిచ్చారు.
కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నియంతృత్వ పాలనతో ఉత్తర కొరియాను ఏలుతోన్న అధినేత కిమ్ జోంగ్ ఉన్. అయితే ప్రజల్ని హింసించడంలో కిమ్.. యమ కింకరుడనే చెప్పాలి. ఉత్తర కొరియాలో కిమ్ ఇచ్చే ఆదేశాలు, ప్రకటనలు ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా కిమ్ మరోసారి అలాంటి సంచలన ప్రకటనే చేశారు.
నవ్వొద్దు..
ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు ప్రజలెవరూ నవ్వొద్దు, మద్యం తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దు.. ఇది తాజాగా కిమ్ సర్కార్ జారీ చేసిన ప్రకటన. వింతగా ఉంది కదా.. ఇంతకీ ఇదంతా దేనికో తెలుసా? కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి ఈరోజుకు 10 ఏళ్లు పూర్తయింది. ఆయన సంస్మరణార్థం ఉత్తర కొరియాలో 11 రోజులు సంతాప దినాలుగా జరుపుతున్నారు. అందుకోసమే ఈ ఆంక్షలు విధించారు.
ఇంకా ఉన్నాయి..
నవ్వొద్దు, మద్యం తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దు.. అన్నారు బాగనే ఉంది అయితే వీడెవడండీ బాబు.. అనుకునే ఆదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటంటే..
- డిసెంబర్ 17న ఉత్తర కొరియాలో ఎవరూ నిత్యవసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లకూడదు
- ఈ 11 రోజుల్లో ఎవరైనా చనిపోయినా.. మృతుడి కుటుంబ సభ్యులు ఏడవకూడదు.
- పుట్టిన రోజులు జరుపుకోకూడదు. వేడకలు చేసుకోకూడదు.
పాటించకపోతే..
ఒకవేళ ఎవరైనా ఈ ఆంక్షలు మీరితో వారిని నేరస్థులుగా పరిగణిస్తూ కఠిన శిక్షలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో సంతాపదినాల సమయంలో ఆదేశాలకు విరుద్ధంగా తాగిన వారిని పట్టుకుని శిక్ష వేశారు. అయితే ఆ తర్వాత వారు కనిపించకపోవడం కొసమెరుపు.
కనుక ఈసారి ప్రజలు కిమ్‌కు భయపడైనా వీటిని పాటించక తప్పదని అధికారులు అంటున్నారు. అయితే కిమ్ కుటుంబ పాలనలో ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు. కానీ కిమ్ జోంగ్ ఉన్.. వచ్చాక ఆ ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి.
Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు
Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్
Also Read: Congress MLA: అత్యాచారం అనివార్యమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి