By: ABP Desam | Updated at : 17 Sep 2021 03:41 PM (IST)
Edited By: Murali Krishna
దూకుడు పెంచిన కిమ్.. ఏకంగా రైలు నుంచి క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అసలు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచానికే సవాల్ విసురుతున్నారు. ఉత్తర కొరియా దూకుడును చూసి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రైల్వే ఆధారిత వ్యవస్థను ఉపయోగించి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. రైలు నుంచి క్షిపణి ప్రయోగం ద్వారా ఉత్తర కొరియన్లు శత్రువులపై దాడిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ నివేదిక పేర్గొంది.
ఇలా ప్రయోగం చేశారు..?
Kim Jong-un fires railway-borne missiles in North Korea in latest weapons test pic.twitter.com/1r6Nf58v4m
— The Sun (@TheSun) September 17, 2021
ఉత్తర కొరియా ఓ రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని తొలిసారి ప్రయోగించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. దట్టమైన పర్వత మధ్య ప్రాంతంలో ఉన్న రైలు వద్దకు ఆయుధ వ్యవస్థను తరలించి ఈ క్షిపణిని పరీక్షించినట్లు పేర్కొంది. రైలు నుంచి గాల్లోకి దూసుకెళ్లిన బాలిస్టిక్ క్షిపణి.. 800 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఢీకొట్టినట్లు కొరియన్ మీడియా పేర్కొంది. రైలు నుంచి వరుసగా రెండు క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించినట్లు తెలిపింది.
సైనిక ఆపరేషన్ సమయంలో శక్తిమంతంగా ఒకేసారి అనేక ప్రదేశాలలో క్షిపణుల ప్రయోగ సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే మొబైల్ క్షిపణి రెజిమెంట్‌ను నిర్వహించింది. కొత్త రక్షణ వ్యూహంలో భాగంగా ఈ రైల్వే మొబైల్ క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు పేర్కొంది.
వరుస క్షిపణి ప్రయోగాలు..
మరోసారి అణుకార్యకలాపాలను మొదలుపెట్టారు కిమ్. ఇటీవల లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
ఈ ప్రయోగానికి కిమ్ హాజరు కాలేదు. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో కిమ్ తో పలుమార్లు అణ్వస్త్రాల నిరాయుధీకరణపై చర్చలు జరిపారు. ఆ సమయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన కిమ్.. బైడెన్ రాకతో దూకుడు పెంచారు. బైడెన్ సర్కార్ మాత్రం.. ఉత్తర కొరియాతో అణు చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా
JEE Advanced 2022 Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
TS VROs G.O 121 : వీఆర్వోల సర్దుబాటు జీవో 121 పై తెలంగాణ హైకోర్టు స్టే
Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం